10, మార్చి 2019, ఆదివారం

నారాయణరావుపేట మండలం (Narayanaraopet Mandal)

నారాయణరావుపేట మండలం
జిల్లాసిద్ధిపేట జిల్లా
వైశాల్యం
జనాభా
గ్రామాలు5
నారాయణరావు పేట మండలం సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం మార్చి 7, 2019న కొత్తగా ఏర్పడింది. సిద్ధిపేట గ్రామీణ మండలంలోని గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అక్టోబరు 1, 2016కు ముందు ఈ ప్రాంతం మెదక్ జిల్లాలో భాగంగా ఉండేది. 2016లో జిల్లాలో పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట గ్రామీణ మండలంలో చేరింది. 2019 మార్చిలో కొత్తగా మండలంగా మారింది. బాతిక్ చిత్రకళలో ప్రసిద్ధి చెందిన యాసాల బాలయ్య ఈ మండలమునకు చెందినవారు.


మండలంలోని గ్రామాలు:

నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్, జక్కాపుర్, గుర్రాలగొంది, మల్యాల. 
 
 
మండలంలోని ప్రముఖ గ్రామాలు:
ఇబ్రహీంపూర్ (Ibrahimpur):
ఇబ్రహీంపూర్ సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలమునకు చెందిన గ్రామము. బాతిక్ చిత్రకళలో ప్రసిద్ధి చెందిన యాసాల బాలయ్య ఈ గ్రామానికి చెందినవారు. 


ఇవి కూడా చూడండి:


విభాగాలు: సిద్ధిపేట జిల్లా మండలాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి