30, జూన్ 2016, గురువారం

సిద్ధిపేట జిల్లా (SIddipet Dist)

జిల్లా కేంద్రంసిద్ధిపేట
విస్తీర్ణం3632 Sq km
జనాభా1012065
మండలాలు24
సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి. సిద్ధిపేట పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. 24 మండలాలలో 19 మండలాలు పూర్వపు మెదక్ జిల్లాలోనివి కాగా 4 మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి, ఒక మండలం పూర్వపు వరంగల్ జిల్లా నుంచి చేర్చబడ్డాయి.

ఇదివరకు మెదక్ జిల్లాలో భాగంగా ఉన్న సిద్ధిపేట పట్టణం ప్రతిపాదిత కొత్త జిల్లా పరిపాలన కేంద్రం కానుంది. సిద్ధిపేట పట్టణం తెలంగాణలోని పెద్ద పట్టణాలలో 10వ స్థానంలో ఉంది.

జిల్లా సరిహద్దులు:
ఈ జిల్లాకు ఉత్తరాన కరీంనగర్ జిల్లా, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా, ఆగ్నేయాన మరియు దక్షిణాన యాదాద్రి జిల్లా, దక్షిణాన మేడ్చల్ జిల్లా, పశ్చిమాన మెదక్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
 
చరిత్ర:
నిజాం కాలంలొ మెదక్ సుబాలో కొనసాగిన ప్రస్తుత జిల్లా ప్రాంతం సెప్టెంబరు 17, 1948న హైదరాబాదు విమోచన అనంతరం మెదక్ జిల్లాలో భాగంగా హైదరాబాదు రాష్ట్రంలో, 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-2014 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. అన్ని మండలాలలో ఉద్యమహోదు తారాస్థాయికి చేరింది. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె పుర్తిగా జయప్రదమైంది. ఊరుఊరునా, వాడవాడన ప్రత్యేక తెలంగాన నినాదం మారుమ్రోగింది. జూన్ 2, 2014న కొత్తగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది. అదివరకటి మెదక్ తో పాటు కరీంనగర్ మరియు వరంగల్ కు చెందిన మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు. డిసెంబరు 8, 2020న కొత్తగా దూలిమిట్ట మండలం ఏర్పాతుతో జిల్లాలో మండల సంఖ్య 24కు చేరింది.


మండలాలు:
సిద్ధిపేట గ్రామీణ, సిద్ధిపేట పట్టణ, నంగనూరు, చిన్నకోడూర్, తొగుట, దౌల్తాబాద్, మీర్‌దొడ్డి, దుబ్బాక, చేర్యాల్, కొమురవెల్లి, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూర్, వర్గల్, రాయిపోల్, హస్నాబాద్, అక్కన్నపేట్, కోహెడ, బెజ్జంకి, మద్దూర్, దూలిమిట్ట,

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు:
తెలంగాణ జిల్లాలు, సిద్ధిపేట జిల్లా,


 = = = = =



Tags: News Districts in telangana, Siddipet Dist in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక