పక్షిశాస్త్రవేత్తగా పేరుపొందిన సలీం అలీ నవంబరు 12, 1896న ముంబాయిలో జన్మించారు. చిన్న వయస్సులోనే పక్షుల పరిశోధనపై మక్కువ చూపి అదే రంగంలో శాస్త్రవేత్తగా అవతరించాడు. పక్షులపై మరింత అధ్యయనం కోసం జర్మనీలోని స్ట్రెస్‌మాన్ వద్ద పక్షిశాస్త్రంలో శిక్షణ పొందాడు. భారతదేశంలో పక్షులపై అధ్యయనం చేసిన ప్రముఖుడిగా పేరుపొంది "ఇండియన్ బర్డ్ మ్యాన్"గా పొందడమే కాకుండా 1985లో రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సలీం అలీ జూన్ 20, 1987న మరణించారు.
ఫాల్ ఆఫ్ స్పారో, ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ ఈయన ముఖ్యమైన రచనలు. ఈయన సేవలకుగాను భారత ప్రభుత్వం నుంచి 1958లో పద్మభూషణ్, 1976లో పద్మవిభూషణ్ పురస్కారాలు పొందారు. 1990లో సలీం అలీ స్మారకార్థం అనైకట్టీ (కోయంబత్తూర్ సమీపంలో) సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ స్థాపించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి