21, మార్చి 2019, గురువారం

వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)

జననంజనవరి 6, 1964
రంగంసినీ గాయకుడు, సంగీతదర్శకుడు
తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడిగా పేరుపొందిన వందేమాతరం శ్రీనివాస్ జనవరి 6, 1964న ఖమ్మంలో జన్మించారు. ఈయన అసలు ఇంటిపేరు కన్నెబోయిన. వందేమాతరం సినిమాలో "వందేమాతర గీతం వరసమారుతున్నది" అనే పాటతో నేపథ్య గాయకుడిగా పేరుపొందటంతో వందేమాతరం ఇంటిపేరుగా మారిపోయింది. గీతం విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.

వందేమాతరం శ్రీనివాస్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు తన సినీజీవితంలో ఇప్పటివరకు 2 ఫిలింఫేర్ అవార్డులు, 9 నంది అవార్డులు, పలు ఇతర అవార్డులు అందుకున్నారు. శ్రీనివాస్ "అమ్ములు" చిత్రంలో హీరో పాత్రలో కూడా నటించారు. 1997లో ఒసేయ్ రాములమ్మ సినిమాకుగాను ఉతమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు. మాదాల రంగారావు నిర్మించిన 'స్వరాజ్యం' సినిమాలో తొలిసారి వందేమాతరం శ్రీనివాస్ పాట పాడారు. జనవరి 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలుగు సినిమా, ఖమ్మం జిల్లా,


 = = = = =


About Vandemataram Srinivas,famous Cinema Persons

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి