ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడైన నిమ్మకాయల చినరాజప్ప అక్టోబరు 1, 1953న జన్మించారు. ఈయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం పెదగాడవల్లి. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1985-90 కాలంలో తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్తు అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1995లో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మెన్‌గా నియమితులైనారు. సుమారు 2 దశాబ్దాల పాటు తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగినారు. 2007లో స్థానికసంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరేళ్ళు కొనసాగినారు.
2014లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా నియమితులైనారు. 2019లో రెండోసారి కూడా పెద్దాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి