24, జులై 2020, శుక్రవారం

పసుపులేటి మాధవీలత (Pasuleti Madhavi Latha)

జననంఅక్టోబరు 2, 1988
రంగంసినీనటి, రాజకీయాలు
సినీనటిగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన పసుపులేటి మాధవీలత అక్టోబరు 2, 1988న కర్ణాటకలోని బళ్ళారిలో జన్మించింది. తెలుగు, తమిళ సినీనటి అయిన మాధవీలత ప్రారంభంలో చిన్న పాత్రలద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2007లొ అతిథిలో "మాధవి" పాత్రలో నటించి, 2008లో "నచ్చావులే" తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ష్, స్నేహితుడు, మిథునం, ఉరుసు, అరవింద్ 2, అంబాలా (తమిళం), చూడాలని, చెప్పాలని, తొలిపాట తదితర సినిమాలలో నటించింది.

పవన్ కుమార్‌ను అభిమానించే మాధవీలత ప్రత్యక్షంగా రాజకీయాలలో చేరక ముందు పవన్‌కు మద్దతుగా ప్రచారం చేసింది. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీలో చేరి 2019లో భాజపా తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసింది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినీనటీమణులు, గుంటూరు జిల్లా ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి