20, డిసెంబర్ 2020, ఆదివారం

గజ్జెల మల్లారెడ్డి (Gajjela Malla Reddy)

జనన
1925
రంగం
పత్రికా సంపాదకుడు, రచయిత,
పదవులు
అధికార భాషాసంఘం అధ్యక్షుడు (1993-95)


జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా, రచయితగా పేరుపొందిన గజ్జెల మల్లారెడ్డి 1925లో కడప జిల్లా అంకాళమ్మ గూడూరులో జన్మించారు. 1956లో సవ్యసాచి పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించి ఈనాడు, విశాలాంధ్ర, ఆంధ్రభూమి, ఉదయం పత్రికలలో సంపాదకుడిగా పనిచేశారు. ఈనాడు దినపత్రికలో పుణ్యభూమి శీర్షికను, ఆంధ్రభూమిలో "చురకలు" శీర్షికను, ఉదయంలో "అక్షింతలు" శీర్షికను నిర్వహించారు. కొంతకాలం "వీచిక" అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. 1985లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 
 
1993-95 కాలంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షులుగా పనిచేశారు. శంఖారావం, మాతకచేరి, రసపిపాసులు, మల్లారెడ్డి గేయాలు అనేవి ఈయన ప్రముఖ రచనలు. అభ్యుదయ రచయితల సంఘంలొ ప్రముఖుడైన గజ్జెల మల్లారెడ్డి  మొదట్లో హేతువాదిగా ఉండి తర్వాతికాలంలో అధ్యాత్మికం వైపు మళ్ళారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సాహితీవేత్తలు, వైఎస్సార్ కడప జిల్లా ప్రముఖులు, 1925,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి