22, జులై 2021, గురువారం

తెలుగు వికీపీడియాలో ప్రజాస్వామ్యం ఎంత?

(గమనిక: తెలుగు భాషాభిమానులు ఈ పోస్టు గురించి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయండి. తెలుగు వికీపీడియా గురించి వాస్తవాలు తెలుగు ప్రజానీకానికి తెలియజేయండి)
తెలుగు వికీపీడియాలో ప్రజాస్వామ్యం ఎంత?
ప్రజాస్వామ్యం శాతం
0%
ఉన్నదేంటి
నియంత లక్షణాలు
ఎప్పటినుంచి ఇలా జరుగుతోంది
ఇటీవలి కాలంలోనే
అందరి దిద్దుబాట్లకు అనుమతి ఎందుకు లేదు
నిర్వహణ చేతకాక
నియంత లక్షణాల వల్ల ఫలితం
తెవికీకి తీరని నష్టం
తెలుగు వికీపీడీయా అనగానే అందరికీ స్పురించేది ఎవరైనా దిద్దుబాట్లు చేసి సమాచారాన్ని చేర్చే విజ్ఞానసర్వస్వం అనీ,. కాని వాస్తవంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. తెవికీ మొదటి పేజీలోనే ఎవరైనా దిద్దుబాట్లు చేసుకోవచ్చని రాశారు. ఈ ప్రజాస్వామ్య స్పూర్తి మొదటిపేజీకే పరిమితం. చాలా పేజీలు ఎలాంటి దిద్దుబాట్లు చేయకుండా తాళం విధించారు. కొత్తవారు ఏదేని దిద్దుబాట్లు చేసిననూ వెంటనే వారిపై, ఆ పేజీలపై నిరోధం విధించడం సర్వసాధారణమైపోయింది.
ప్రజాస్వామ్య లక్షణాలతో కొనసాగించాల్సిన తెవికీని కొందరు నిర్వాహకులు పూర్తిగా నియంత లక్షణాలతో మార్చివేశారు. ఒకరిద్దరు నిర్వ్హకులు ఇలా నియంత లక్షణాలను కల్గియున్ననూ మిగితా నిర్వాహకులు ఏమయ్యారనేది అంతుచిక్కని ప్రశ్న. భాషాభిమానులు ఈ విషయంపై చాలారోజుల నుంచి ప్రశ్నిస్తున్ననూ అసలు మిగితా నిర్వాహకులు బతికే ఉన్నారా అనేది తెలియడం లేదు. నిర్వహణ చేతకానిచో పదవులు వదిలివేయడం ఉత్తమం.

నియంత లక్షణాలతో తెవికీని ఛిన్నాభిన్నం చేసిన నిర్వాహకులు నిర్వాహక, అధికార పదవులను వదిలేసి కొత్తవారికి ఇమ్మంటున్ననూ నోరుమెదపటం లేదు పైగా తెవికీ పదవులలో నాట్యం చేస్తున్నారు. ఇప్పటికే కొందరి నియంత లక్షణాలతో తెవికీకి చాలా నష్టం జరిగింది. ఈ నష్టం ఇప్పట్లో పూడ్చలేనిది. అయినా కొందరికి చీమ కుట్టీనట్లయినా కావడం లేదు.

కొన్నేళ్ళ క్రితం వైజాసత్య, చంద్రకాంతరావు, కాసుబాబుల కృషితో ఎంతో అభివృద్ధిచెందిన తెలుగు వికీపీడియా ఈ మధ్య కొందరి దారుణమైన నియంత లక్షణాలతో విసిగీ విసిగీ చివరికి చచ్చిపోయింది. వికీపీడియాకు మళ్ళీ జీవం పోసి పూర్వవైభవం తీసుకువస్తానని చంద్రకాంతరావు చేసిన ప్రతిపాదనకు ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీనితో తెలుగు ప్రజానీకానికి తీరని నష్టం జరిగింది..
 
తెవికీ అనేది ఎవరి అబ్బసొత్తు కానేకాదు. ఇది అందరిదీ. దిద్దుబాట్లలో కూడా అందరికీ అవకాశం కల్పించాలి. కాకుంటే పూర్తిగా ఛిన్నాభిన్నం కాకుండా నిర్వహణ బాగుంటే చాలు. కాని నిర్వహణ చేతకాక రాసినది తొలగించడం, పేజీలకు తాళాలు విధించడం, సభ్యులపై, ఐపి అడ్రస్ లపై నిరోధాలు విధించడం మాత్రం పూర్తిగా తప్పుడు చర్య మరియు ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి వ్యతిరేకం మరియు నిర్వాహక హోదాను దుర్వినియోగపర్చినట్లుగా చెప్పవచ్చు. 

ప్రజాస్వామ్య స్పూర్తితో అందరికీ అవకాశం కల్పిస్తూ విజ్ఞానసర్వస్వాన్ని అభివృద్ధి పరుస్తూ అందరి నుంచి ప్రశంసలు పొందాల్సి ఉండగా, దీనికి పూర్తి భిన్నంగా నిర్వహణ చేతకాక అనామకులచే బండబూతులు తిన్న నిర్వాహకులున్నారు. పిరికిపందులు అనీ, నాపై నిరోధం విధించి ఏం పీకినట్లు అనీ తిట్లు తిన్న నిర్వాహకూలకు ఇప్పటికీ మళ్ళీ అవే చేష్టలతో ఊగుతున్నారు. తిట్లు తినడం నిర్వాహకులకు అంతిష్టమా?
 
ఇవి కూడా చూడండి:
 


హోం
విభాగాలు: తెలుగు వికీపీడియా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి