దుర్గ్ జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 28 జిల్లాలలో ఒకటి. జిల్లా వైశాల్యం 2,718 చకిమీ మరియు 2011 జనాభా లెక్కల ప్రకారం 17.21 లక్షల జనాభా కల్గియుంది. మినీ ఇండియాగా పిల్వబడే పారిశ్రామిక పట్టణం భిలాయ్ ఈ జిల్లాలో ఉంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్ భాఘేల్ ఈ జిల్లాకు చెందినవారు. జిల్లాలో 3 తహసీల్స్ ఉన్నాయి. కుంహరిలో మహామాయ ఆలయం ఉంది. పాండవాని నృత్యం జిల్లాకు చెందిన ప్రధాన నృత్యం. జిల్లాలో 3 తహసీల్లు, 389 రెవెన్యూ గ్రామాలు, 10 పురపాలక సంఘాలు కలవు. భౌగోళికం, సరిహద్దులు: దుర్గ్ జిల్లా 20°23' నుంచి 22°02 ఉత్తర అక్షాంశం మరియు 80°46' నుంచి 81°88' తూర్పు రేఖాంశం మధ్యలో 2,238 చకిమీ వైశాల్యంతో ఉంది. దుర్గ్ జిల్లా మహానది పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది. శివనాథ్ నది జిల్లా గుండ ప్రవహిస్తుండగా, దుర్గ్ జిల్లా తూర్పు సరిహద్దు గుండా కారున్ నది ప్రవహిస్తోంది. జిల్లాలో 9% అటవీప్రాంతం ఉంది. జిల్లాకు ఉత్తరాన బెమెతెర జిల్లా, తూర్పున రాయ్‌పూర్ జిల్లా, పశ్చిమాన రాజ్‌నందన్‌గావ్ జిల్లా, దక్షిణాన బాలోడ్ జిల్లా, ఆగ్నేయాన ధంతారి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: దుర్గ్ జిల్లా 1906లో ఏర్పడింది, 1906కు ముందు రాయ్‌పూర్ జిల్లాలో దుర్గ్ తహసీల్‌గా ఉండేది. 1973లో దుర్గ్ జిల్లా నుంచి రాజ్‌నందన్‌గాన్ జిల్లా వేరుపడింది. 2000లో ఛత్తీస్‌గఢ్ అవతరణకు ముందు ఈ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా కొనసాగింది. 2012లో జిల్లా మళ్ళీ ముక్కలై Bemetara, Balod కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఆర్థికం: భిలాయ్‌లో ఇనుము-ఉక్కు కర్మాగారం ఉంది. ఇది 1959లో రష్యా సహకారంతో ప్రారంభించబడింది. జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసాయం. రవాణా సౌకర్యాలు: జాతీయ రహదారి నెం.6 (ముంబాయి-కోల్‌కత) దుర్గ్ జిల్లా మీదుగా వెళ్తుంది (జిల్లా కేంద్రం దుర్గ్ మీదుగా). ముంబాయి-కోల్‌కత రైలుమార్గం కూడా దుర్గ్ జిల్లా మీదుగా వెళ్ళుచున్నది. దుర్గ్ జిల్లా సౌత్-ఈస్ట్ రైల్వే జోన్లో భాగంగా ఉంది. రాజ్‌నందన్‌గాన్-రాయ్‌పూర్ మధ్యలో దుర్గ్ రైల్వేస్టేషన్ ఉంది. జిల్లాలో విమానాశ్రయం లేదు కాని జిల్లా కేంద్రం దుర్గ్ నుంచి 50 కిమీ దూరంలో రాయ్‌పూర్‌లో విమానాశ్రయం ఉంది. జిల్లాలోని పురపాలక సంఘాలు: దుర్గ్, భిలాయ్, రిసాలి, భిలాయ్ చరొడ, అహివాలా, కుమహరి, జాముల్, ధమ్ధా, పటాన్, ఉటాయ్,
ఇవి కూడా చూడండి:
= = = = =
|
13, జనవరి 2021, బుధవారం
దుర్గ్ జిల్లా (Durg District)
12, జనవరి 2021, మంగళవారం
తుర్లపాటి కుటుంబరావు (Turlapaty Kutumba Rao)
ప్రముఖ పాత్రికేయుడిగా పేరుపొందిన తుర్లపాటి కుటుంబరావు ఆగస్టు 10, 1933న విజయవాడలో జన్మించారు. ప్రారంభంలో టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. తన పాత్రికేయ ప్రస్థానంలో 18 ముఖ్యమంత్రుల వద్ద పనిచేశి "18 ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు" పుస్తకాన్ని రాశారు. భారతప్రభుత్వం నుంచి 2002లో పద్మశ్రీ పురస్కారం పొంది ఈ ఘనత పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంచే కళాప్రపూర్ణ పొందారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. 20వేల సమావేశాలలో వక్తగా ప్రసంగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. "నా కలం - నా గళం" పేరిట ఆత్మకథను రాశారు. జనవరి 11, 2021న తుర్లపాటి మరణించారు.
పాత్రికేయ ప్రస్థానం: ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించి 1951లో ఎన్జీ రంగా వాహిని పత్రికలో తొలిసారిగా ఉప సంపాదకులుగా పనిచేసి ఆ తర్వాత చలనాని రామారాయ్ "ప్రతిభ" పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజాపత్రికలో ఆంధ్రప్రాంత వార్తల సంపాదకునిగా పనిచేశారు. 1960-63 మరియు 1965-91 కాలంలో ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. ఆ తర్వాత వార్త పత్రికలో కొంతకాలం పనిచేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్నప్పుడు వార్తల్లోని వ్యక్తి శీర్షికన సుమారు 4000 వ్యక్తుల జీవితచరిత్రను అందించారు. ఈ శీర్షిక వల్ల తుర్లపాటికి మంచిపేరు వచ్చింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
10, జనవరి 2021, ఆదివారం
మాధవ్‌సింగ్ సోలంకి (Madhav Singh Solanki)
గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సోలంకి జూలై 30, 1927న పిలుదర (మెహసనా జిల్లా, గుజరాత్)లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాధవ్‌సింగ్ సోలంకి గుజరాత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 3సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 93 సం.ల వయస్సులో జనవరి 9, 2021న మరణించారు. ఈయన కుమారుడు భారత్ సింగ్ కూడా గుజరాత్ పిసిసి అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం : 1976లో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపటిన సోలంకి 1980లో రెండోసారి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పూర్తి ఐదేళ్ళు పదవిలో కొనసాగినారు. 1991లో పి.వి.నరసింహరావు మంత్రివర్గంలో కీలకమైన విదేశీవ్యవహారాల శాఖ మంత్రిపదవిని నిర్వహించారు. 1989లో మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినారు. ఈయన భద్రన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1980 దశకంలో క్షత్రియ, హరిజన, ఆదివాసి, ముస్లింల మద్దతుపై ఆధారపడ్డారు. గుజరాత్ రాజకీయాలలో ఇది ఖామ్ (KHAM) సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది. ఇవి కూడా చూడండి :
= = = = =
|
7, జనవరి 2021, గురువారం
నల్గొండ పట్టణం (Nalgonda Town)
నల్గొండ పట్టణము తెలంగాణ రాష్ట్రపు ప్రధాన పట్టణాలలో ఒకటి. ఈ పట్టణం జిల్లా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, లోక్‌సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉంది. హైదరాబాదు నుంచి ఆగ్నేయ దిశలో 100 కిమీ దూరంలో ఉన్న ఈ పట్టణానికి రైలుమార్గం కూడా ఉంది. జాతీయ రహదారి కూడా సమీపం నుంచి వెళ్ళుచున్నది. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం పూర్వనామం నీలగిరి. పట్టణ శివారులో ఉదయసముద్రం, ఛాయాసోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం ఉన్నాయి. 2011 ప్రకారం నల్గొండ పట్టణ జనాభా 1.65 లక్షలు. పట్టణ పాలన పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. ప్రముఖ రచయిత కాంచనపల్లి చినవెంకటరామారావు ఇక్కడివారే (నల్గొండ శివారు).
భౌగోళీకం: నల్గొండ పట్టణం 17.05° ఉత్తర అక్షాంశం మరియు 79.26° తూర్పు రేఖాంశంపై ఉంది. ఈ పట్టణం సముద్రమట్టం నుంచి 420 మీ. ఎత్తులో ఉంది. చుట్టూ కొండలతో ఆవరించబడి ఉంది కాబట్టి చలికాలంలోనూ కనిష్ట ఉష్ణోగ్రత 30°Cలకు పైబడి ఉంటుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు 40°C దాటి ఉంటుంది. 2011 ప్రకారం నల్గొండ పట్టణ జనాభా 1.65 లక్షలు. చరిత్ర: నల్గొండ పట్టణానికి పాతరాతియుగం కాలం నాటి చరిత్ర ఉంది. పట్టణ శివారులో పాత రాతియుగం కాలపు పనిముట్లు కూడా లభించాయి. శివారులోలో కొత్త రాతియుగపు ఆనవాళ్ళు కూడా లభ్యమయ్యాయి. మౌర్యులు, శాతవాహనుల కాలంలో నల్గొండ భాగంగా ఉండేది. ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడ బౌద్ధమతం విలసిల్లింది. చాళుక్యుల మరియు రాష్ట్రకూటుల తర్వాత కాకతీయుల కాలంలో పట్టణం కొత్తరూపు సంతరించుకుంది. కాకతీయుల తర్వాత క్రీ.శ.1455లో జలాల్ఖాన్ నల్గొండను వశపర్చుకున్నాడు. కాని వెంటనే బహమనీలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల పాలనలో కొనసాగి సెప్టెంబరు 17, 1948న భారత యూనియన్‌లో విలీనమైంది. 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగి జూన్ 2, 2014న కొత్తగ అవతరించిన తెలంగాణలో భాగమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, మహిళలు ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2011లో 42 రోజుల పాటు సకలజనుల సమ్మె పూర్తిగా జయప్రదమైంది.
పట్టణ పాలన: నల్గొండ పట్టణ పాలన పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. నల్గొండ పురపాలక సంఘం 1941లో ప్రారంభమైంది. ప్రారంభంలో మూడో శ్రేణి పురపాలక సంఘంగా మొదలై అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ప్రస్తుతం మొదటి శ్రేణి పురపాలక సంఘంగా స్థిరపడింది. దీన్ని నగరపాలక సంస్థ (కార్పొరేషన్)గా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. పారిశుద్ధ్యం, వీధిదీపాల ఏర్పాటు, మంచినీటి సరఫరా, ప్రజారోగ్యం తదితర పనులను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ప్రభుత్వ గ్రాంటులు మరియు ప్రత్యక్ష వసూళ్ళు (ఆస్తిపన్ను, కొళాయిపన్నులు, అనుమతిపన్నులు etc) పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వనరులు. రవాణా సౌకర్యాలు: పూనె నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి నెం.65 నల్గొండ పట్టణానికి 15 కిమీ దూరం నుంచి నార్కెట్‌పల్లి మీదుగా వెళ్ళుచున్నది. అయితే జాతీయ రహదారి నెం. 565 నల్గొండ మీదుగా వెళ్ళుచున్నది. తెలంగాణ ఆర్టీసి బస్సు డిపో కూడా నల్గొండలో ఉంది. పట్టణానికి రైలు సదుపాయం కూడా ఉంది. పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్లో దక్షిణమధ్య రైల్వేలో గుంటూరు డివిజన్లో భాగంగా నల్గొండ రైల్వేస్టేషన్ ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్ (Vennelakanti Rajeswara Prasad)
తెలుగు సినీపాటల మరియు మాటల రచయితగా పేరుపొందిన వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్ నవంబరు 30, 1957న నెల్లూరులో జన్మించారు. విద్యార్థి దశలోనే రామచంద్ర శతకం, లిలితాశతకం రచించిన వెన్నలకంటి స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ సినీరంగంలో ప్రవేశించారు. 986లో శ్రీరామచంద్రుడు చిత్రంతో సినీప్రస్థానం ఆరంభించిన వెన్నలకంటి తొలిపాట "చిన్ని చిన్ని కన్నయ్య ..." (శ్రీరామచంద్రుడు). తన సినీప్రస్థానంలో 300కుపైగా సినిమాలలో 2500కు పైగా సినీపాటలు రాశారు.
వెన్నలకంటి 2000లో ఉత్తమ గేయరచయితగా నంది పురస్కారం పొందారు. జనవరి 5, 2021న చెన్నైలో మరణించారు. కుమారుడు శశాంక్ వెన్నలకంటి కూడా మాటల రచయితగా గుర్తింపు పొందారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
6, జనవరి 2021, బుధవారం
కాలరేఖ 2021 (Timeline 2021)
|
హోం, విభాగాలు: కాలరేఖలు, 2021, |
3, జనవరి 2021, ఆదివారం
రామేశ్వర్ రావు జూపల్లి (Rameshwar Rao Jupally)
పారిశ్రామికవేత్తగా, రియల్ ఎస్టేట్ అధినేతగా, టెలివిజన్ ఛానెల్ యజమానిగా ప్రసిద్ధిచెందిన రామేశ్వర్ రావు జూపల్లి సెప్టెంబరు 16, 1955న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికుళ్ళలో జన్మించారు. వృత్తితీర్త్యా ప్రారంభంలో హోమియోపతి వైద్యుడు. మొదట్లో దిల్సుఖ్నగర్ (హైదరాబాదు)లో హోమియోపతి ఆసుపత్రి స్థాపించారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి పేరుగాంచారు. 1991లో My Home Group కంపెనీ స్థాపించి పారిశ్రామికవేత్తగా నిర్మాణ రంగంలో పేరుపొందారు. 1996లో మహాసిమెంట్ కంపెనీని స్థాపించి మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు. TV9 ఛానెల్ కొనుగోలు చేసి టెలివిజన్ ఛానెల్ యజమానిగా పేరుపొందారు. ఒక బిలియన్ డాలర్ల ఆస్తుల అధినేతగా ఉన్నారు. ఈయన మైహోం రామేశ్వర్ రావుగా పేరుపొందారు.
ఈయన శ్రీశ్రీశ్రీ త్రిడండి చినజీయర్ స్వామి భక్తుడు మరియు సన్నిహితుడు. ఈయన అధీనంలోని మహాసిమెంట్ కంపెనీకి సూర్యాపేటతో సహా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో 4 ప్లాంట్లు ఉన్నాయి. శంషాబాదు (రంగారెడ్డి జిల్లా) వద్ద హోమియో ఆసుపత్రి నిర్మించి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. 2016 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు (మార్కెటింగ్ రంగంలో-గోల్డెన్ గ్లోబల్ ఏజెన్సీ-కౌలాలంపూర్చే). 2016లోనే ఉత్తమ రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్శన్ కంపెనీగా (హైదరాబాదులో) జూపల్లికి చెందిన మై హోం ఎంపికైంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
2, జనవరి 2021, శనివారం
బూటాసింగ్ (Buta Singh)
జర్నలిస్టుగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన బూటాసింగ్ మార్చి 21, 1934న ముస్తాఫాపూర్ (జలంధర్ జిల్లా, పంజాబ్)లో జన్మించారు. ప్రారంభంలో అకాలీదళ్ నుంచి పోటీచేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టిలో చేరిన బూటాసింగ్ తన సుధీర్ఘ 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిగా పేరుపొందారు. 8 సార్లు లోక్‌సభకు ఎన్నిక కావడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాలలో హోంశాఖతో పాటు పలు కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. రెండేళ్ళపాటు బీహార్ గవర్నరుగా కూడా పనిచేశారు. బూటాసింగ్ Punjabi Speaking State - A Critical Analysis గ్రంథాన్ని రచించారు. జనవరి 2, 2021న బూటాసింగ్ మరణించారు. కుమారుడు అరవింద్ సింగ్ లవ్లీ కూడా రాజకీయ నాయకుడిగా (భాజపా తరఫున) పేరుపొందారు
రాజకీయ ప్రస్థానం: ప్రారంభంలో జర్నలిస్టుగా జీవనం ప్రారంభించిన బూటాసింగ్ జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే 1962లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో 1999 వరకు మొత్తం 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1974లో తొలిసారిగా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా స్థానం పొంది ఆ తర్వాత ఇందిర, రాజీవ్ మంత్రివర్గాలలో హోంశాకతో పాటు పలు కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత పార్టీ చిహ్నంకై ఇందిర బూటాసింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. 1978-80 కాలంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల సమయంలో ఆసియాక్రీడల స్పెషల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మెన్‌గా వ్యవహరించారు. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు జె.ఎం.ఎం.ముడుపుల కేసు వల్ల 1989లో రాజీనామా చేయవల్సి వచ్చింది. 2004-06 కాలంలో బీహార్ గవర్నరుగా పనిచేశారు. 200లో బీహార్ శాసనసభ రద్దుచేయడం, ఆ తర్వాత ఈ చర్యపై సుర్పీంకోర్టు తప్పుపట్తడంతో గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించరు. 2007-10 కాలంలో జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మెన్‌గా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
1, జనవరి 2021, శుక్రవారం
ఉమా భారతి (Uma Bharti)
రాజకీయ నాయకురాలిగా, హిందూ సాధ్విగా, హిందుత్వ ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన ఉమాభారతి మే 3, 1959న మధ్యప్రదేశ్‌లోని టికాంగఢ్ జిల్లా దుండాలో జన్మించారు. చిన్నవయస్సులోనే హిందుత్వ భావాలతో ఉన్న ఉమాభారతి విజయరాజె సింధియా ప్రోత్సాహంతో భాజపాలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్నత పదవులు పొందారు.
రాజకీయ ప్రస్థానం: తొలిసారిగా 1984లో ఖజురాహో నుంచి లోక్‌సభ పోటీచేసిననూ ఇందిరగాంధీ హత్యతో సానుభూతి పవనాలు వీచడంతో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయారు. ఎల్.కె.అద్వానీకి సన్నిహితంగా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. రామజన్మభూమి వివాదంలో లిబర్హన్ కమీషన్ చే అభియోగం కూడా మోపబడ్డారు. 1991లో ఉమాభారతి భోపాల్ నుంచి నుంచి గెలుపొంది అటల్ బిహారి వాజపేయి మంత్రివర్గంలో చోటు సంపాదించింది. 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాజపాకు నాయకత్వం వహించి విజయం సాధించి పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. 1994 హుబ్లీకేసులో అరెస్ట్ వారెంట్ రావడంతో 2004లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఎల్.కె.అద్వానీ పై విమర్శలు చేసి భాజపా నుంచి సస్పెండ్ అయ్యారు. 2006లో ప్రత్యేకంగా భారతీయ జనశక్తి పార్టీ స్థాపించిననూ ఎలాంటి ప్రభావం చూపనందున 2011లో మళ్ళీ భాజపాలో ప్రవేశించారు. ఝాన్సీ నుంచి గెలుపొంది 2014-19 కాలంలో నరేంద్రమోడి మంత్రివర్గంలో పనిచేశారు. 2019లో పోటీచేయలేరు. 2019-20లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
చౌడాపూర్ మండలం (Chowdapur Mandal) :
చౌడాపుర్ వికారాబాదు జిల్లాకు చెందిన ప్రతిపాదిత మండలము. డిసెంబరు 31, 2020న ఈ మండలం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ప్రకటన జారీఅయింది. కుల్కచర్ల మండలంలోని 7 రెవెన్యూ గ్రామాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని 7 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన జారిచేయబడింది. 30 రోజుల వ్యవధిలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రతిపాదిత గ్రామాలు 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కుల్కచర్ల (అప్పుడు రంగారెడ్డి జిల్లా)లో భాగంగా ఉండేవి. ప్రతిపాదన రెవెన్యూ గ్రామాలు: ముక్తి వెంకటాపూర్, లింగంపల్లి, మందిపల్లి, విఠలాపూర్, వీరాపూర్, చౌడాపూర్, అడవి వెంకటాపూర్ (ఇవి ప్రస్తుతం కుల్కచర్ల మండలంలో ఉన్నాయి) మరికల్, కమ్మన్కాల్వ, కొత్తపల్లి, మల్కాపూర్, చాకల్‌పల్లి, ముగుళ్లపల్లి, పుర్సంపల్లి (ఇవి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఉన్నాయి) మండలంలోని ప్రముఖ గ్రామాలు: చౌడాపూర్ (Chowdapur) : చౌడాపూర్ వికారాబాదు జిల్లా కుల్కచర్ల మండలమునకు చెందిన గ్రామము. చౌడాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు డిసెంబరు 31, 2020న ప్రాథమిక ప్రకటన వెలువడింది. తుది ప్రకటన వెలువడిన పిదప ఈ గ్రామం మండలకేంద్రంగా మారుతుంది. గ్రామ జనాభా సుమారు 3000. కమ్మన్కల్వ (Kammankalwa) :
కమ్మన్కల్వ మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. గ్రామానికి సమీపంలో 3 చెరువులున్నాయి. ముదిరాజ్ కులస్థులు అధికంగా ఉన్నారు. గ్రామ జనాభా సుమారు 2వేలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2016కు ముందు గ్రామం కుల్కచర్ల మండలంలో ఉండగా అక్టోబరు 11, 2016న మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో కలిసింది. డిసెంబరు 31, 2020 నాటి ప్రాథమిక ప్రకటన ప్రకారం ఈ గ్రామం వికారాబాదు జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేయనున్న చౌడాపూర్ మండలంలో కలుస్తుంది.
= = = = =
|
30, డిసెంబర్ 2020, బుధవారం
గణపతిరావు దేవజీ తపాసె (Ganpatrao Devji Tapase)
సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన గణపతిరావు దేవజీ తపాసె అక్టోబరు 30, 1909న జన్మించారు. 1946, 1952లలో బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. 1962-68 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినారు. 1977 నుంచి 80 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, 1982-84 కాలంలో హర్యానా గవర్నరుగా పనిచేశారు. అక్టోబరు 3, 1992న ముంబాయిలో మరణించారు. ఈయన ఆత్మకథ పేరు From Mudhouse to Rajbhavan.
= = = = =
|
డిసెంబరు 30 (December 30)
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 30
ఇవి కూడా చూడండి:
= = = = =
|
28, డిసెంబర్ 2020, సోమవారం
డిసెంబరు 28 (December 28)
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 28
(ఉడ్రోవిల్సన్ వ్యాసం)
(ధీరూభాయి అంబానీ వ్యాసం)
ఇవి కూడా చూడండి:
= = = = =
|
27, డిసెంబర్ 2020, ఆదివారం
డిసెంబరు 27 (December 27)
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 27
(లూయీపాశ్చర్ వ్యాసం) (ప్రముఖ శాస్త్రవేత్తల జాబితా)
ఇవి కూడా చూడండి:
= = = = =
|
26, డిసెంబర్ 2020, శనివారం
సతీష్ ధావన్ (Satish Dhawan)
గణితవేత్తగా మరియు ఏరోస్పేస్ ఇంజనీయరుగా పేరుపొందిన సతీష్ ధావన్ సెప్టెంబరు 25, 1920న శ్రీనగర్‌లో పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఈయన భారతదేశ ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ రీసెర్చి పితామహుడిగా పరిగణించబడతారు. భారత అంతరిక్ష రంగంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరైన సతీష్ ధావన్ ఇస్రో చైర్మెన్‌గా, ఇండియన్ స్పేస్ కమీష చైర్మెన్‌గా, IISc అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు. సతీష్ ధావన్ జనవరి 3, 2002న బెంగళూరులో మరణించారు. ఈయన కూతురు జ్యోత్స్న మాలిక్యులర్ బయాలిస్ట్గా పేరుపొందింది. ప్రస్థానం: సతీష్ ధావన్ లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీపట్టా పొంది అమెరికాలోని మిన్నిసొట విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏర్నాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1951లో ఇండీయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ఫ్యాకల్టీగా ప్రవేశించి దశాబ్దం తర్వాత అదేసంస్థకు డైరెక్తర్ అయ్యారు. 1972లో ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మెన్‌గా పదవి పొందారు. 1984 వరకు ఇస్రో చైర్మెన్‌గా వ్యవహరించారు. 1977-79 కాలంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డైరెక్టరుగా కూడా పనిచేశారు. పురస్కారాలు, గుర్తింపులు: 1971లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, 1981లో పద్మవిభూషణ్ పురస్కారాలు
పొందారు. 1999లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు పొందారు. ఈయన గౌరవార్థం
శ్రీహరికోటలో షార్ కేంద్రానికి సతీష్ ధావన్ షార్ కేంద్రంగా
పేరుపెట్టబడింది. ఐఐటి రోపార్‌కు ధావన్ పేరుపెట్టబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
25, డిసెంబర్ 2020, శుక్రవారం
మాసాయిపేట మండలం (Masaipet Mandal)
మాసాయిపేట మెదక్ జిల్లాకు చెందిన మండలము. 7వ నెంబరు (కొత్తది 44) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్, దుబ్బాక మరియు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 11733. డిసెంబరు 24, 2020న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. ఎల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు మరియు చేగుంట మండలంలోని 3 గ్రామాలు మొత్తం 9 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటుచేయబడింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం మెదక్ జిల్లాలో తూర్పువైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. నిజాంపేట మండలం, తూఫ్రాన్ మండలం, ఎల్దుర్తి, చేగుంట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 14733. మండలంలో పెద్ద గ్రామము మాసాయిపేట. చరిత్ర: ఈ మండలంలోని గ్రామాలు సెప్టెంబరు 17, 1948న హైదరాబాదు నిజాం రాజ్యం నుంచి విమోచన పొంది భారత యూనియన్‌లో చేరాయి. 1946-48 కాలంలో విమొచనోద్యమంలో ఈ మండలంలోని పలువులు పోరాడారు. 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా కొనసాగింది. జూన్ 2, 2014లో తెలంగాణలో భాగమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతంలో ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజులపాటు సకల జనుల సమ్మె పూర్తిగా విజయవంతమైంది. డిసెంబరు 24, 2020న చేగుంట మరియు ఎల్దుర్తి మండలాల లోని 9 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటుచేయబడింది. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం మరియు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
మాసాయిపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Masaipet, Ramanthapur, Achampet, Koppulapally, Lingareddipally, Hakimpet, Chetlathimmaipally, Pothampally, Pothamshetpally కాలరేఖ:
ప్రముఖ గ్రామాలు
మాసాయిపేట (Masaipet):మాసాయిపేట మెదక్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళు రైలుమార్గం కూడా గ్రామంలోదుగా వెళ్ళుచున్నది. మాసాయిపేటలో రైల్వేస్టేషన్ ఉంది. పిన్ కోడ్ 502325. గ్రామంలో రోహిణి మినరల్స్ పైవేట్ లిమిటెడ్ కర్మాగారం ఉంది. 2014, జూలై 24న మాసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే గేటువద్ద పాఠశాల బస్సు రైలును ఢీకొనడంతో 20 మంది విద్యార్థులు మరణించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Masaipet Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
డిసెంబరు 25 (December 25)
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 25
ఇవి కూడా చూడండి:
= = = = =
|
24, డిసెంబర్ 2020, గురువారం
కామిని రాయ్ (Kamini Roy)
బెంగాలీ కవియిత్రి, సంస్కర్త మరియు స్త్రీవాదిగా పేరుపొందిన కామిని రాయ్ అక్టోబరు 12, 1864న బెంగాల్‌లోని బసంద (ఇప్పటి బంగ్లాదేశ్)లో జన్మించింది. బెతూన్ పాఠశాలలో విద్యనభ్యసించి బ్రిటీష్ కాలంలో పాఠశాలకు హాజరైన మొదటి బాలికలలో ఒకరిగా పేరుపొందింది. బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గౌరవ గ్రాడ్యుయేట్ గానూ, బీఏ ఆనర్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన మెుదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది.
పలు రచనలు చేసి రచయితగా పేరుపొందిన కామిని రాయ్ సంస్కర్తగా బెంగాల్లో మహిళల ఓటుహక్కు కోసం ఉద్యమించిన నారీ సమాజ్ లో కూడా పాలుపంచుకుంది. అబాలా బోస్ నుండి స్త్రీవాద భావనలు తీసుకుంది. బెంగాలీ సాహిత్య సదస్సు అధ్యక్షురాలిగా, బెంగాలి సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. కామినితాయ్ ముఖ్యమైన రచనలు : మహాశ్వేతా పుండొరిక్, పౌరాణికి, ద్విప్ ఓ ధూప్, మాల్య ఓ నిర్మల్య, గుంజన్ (పిల్లల పుస్తకం), బాలిక సిక్కర్ ఆదర్శ. కామిని రాయ్ సెప్టెంబరు 27, 1933న హజారీబాగ్ (బీహార్)లో మరణించింది. ఈమె సొదరుడు నిసిత్ చంద్ర సేన్ కలకత్తా హైకోర్టులో ప్రఖ్యాత న్యాయవాది మరియు కలకత్తా మేయర్ గా పనిచేశారు. భర్త కేదార్నాథ్ రాయ్. సొదరి జమినిరాయ్ నేపాల్ రాజు ఆస్థాన వైద్యురాలిగా పనిచేసింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
యాసాల బాలయ్య (Yasala Balaiah)
బాతిక్ చిత్రకళలో పేరుపొందిన యాసాల బాలయ్య 1939లో సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపట్నంలో జన్మించారు. 1962లో ఆర్ట్ టీచరుగా జీవన ప్రస్థానం ఆరంబించి ఇండోనేషియా చిత్రకళ పద్దతి అయిన బాతిక్ కళలో పెయింటింగ్‌లను వేయడంలో పేరుపొంది బాతిక్ బాలయ్యగా పేరు సంపాదించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కూడా పాల్గొన్నారు. 2016లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ అవార్డు పొందారు. బాలయ్య డిసెంబరు 23, 2020న మరణించారు.
బాలయ్య తన చిత్రాలలో పల్లె జీవనాన్ని ముఖ్యంగా పల్లె మహిళల జీవనవిధానాన్ని ఉట్టిపడేలా చిత్రించారు. తన ప్రతిభతో 2003లో ఆలిండియా ఫైన్ ఆర్త్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ (AIFACS)చే సన్మానం పొందారు. 1991లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, 1994లో రాష్ట్రపతిచే జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాద్యాయులుగా అవార్డు పొందారు. బాలయ్య చిత్రాలు లాస్ఏంజిల్స్ మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియంలో, హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో, లలితకళా అకాడమీలో, చెన్నై మ్యూజియంలో ప్రదర్శితమౌతున్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
23, డిసెంబర్ 2020, బుధవారం
పోపూరి లలిత కుమారి (Popuri Lalitha Kumari)
తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా పేరుపొందిన పోపూరి లలిత కుమారి నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. ఈమె "ఓల్గా" కలంపేరుతో ప్రసిద్ధి చెందింది. 1986లో "సహజ" పేరుతో తొలి నవల రచించింది. చలన చిత్ర రంగములో 'ఉషా కిరణ్' సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది. ఈమె ప్రముఖ రచనలు: ఆకాశంలో సగం, అలజడి మాజీవితం, కన్నీటి కెరటాల వెన్నెల, నవలామాలతీయం, అక్షర యుద్ధాలు. లలితకుమారి మహిళల కోసం అస్మిత రిసోర్స్ సెంటర్ ప్రారంభించారు.
పురస్కారాలు: 1987లో "స్వేచ్చ" నవలకు ఉషోదయ పబ్లికేషన్స్ వారిచే ఉత్తమ నవల రచయిత అవార్డు, 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి "తోడు" సినిమాకథకు ఉత్తమ కథ రచయితగా నంది అవార్డు, 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ స్త్రీ రచయిత అవార్డు, 2015లో విముక్త కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
