కపిలవాయి లింగమూర్తి నాగర్‌కర్నూల్ జిల్లా చెందిన కవులలో ప్రముఖులు. మార్చి 31, 1928న బల్మూరు మండలం జినుకుంటలో జన్మించిన లింగమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్ కర్నూల్ జాతీయ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరారు. ఆ తర్వాత పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి 1983 ఫిబ్రవరిలో ఉద్యోగవిరమణ పొందారు. పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందారు. నవంబరు 6, 2018న మరణించారు
రచనలు: తెలంగాణలోనే ప్రముఖ సాహితీవేత్తగా పేరుగాంచిన కపిలవాయి చిన్నతనంలోనే కవితారచనకు పూనుకున్నారు. ఇప్పటివరకు 60కిపైగా గ్రంథాలు రచించారు. వీటితోపాటు పద్యాలు, గేయాలు, కవితలు, కావ్యాలు అనేకంగా రచించారు. లింగమూర్తి రచించిన ప్రముఖ రచనలలో పాలమూరు జిల్లా దేవాలయాలు, సాలగ్రామ శాస్త్రం, శ్రీ మత్ప్రతాపగిరి ఖండం, మాంగళ్య శాస్త్రం, ఆర్యా శతకం ప్రముఖమైనవి. గుర్తింపులు: సాహితీరంగంలో కపిలవాయి చేసిన కృషికిగాను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు, గుర్తింపులు లభించాయి. ఎన్టీరామారావు మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి ఉత్తమ పండిత పరిశోధన అవార్డు పొందినారు. 2014 ఆగస్టులో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
= = = = =
| |||||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి