22, జనవరి 2013, మంగళవారం

బల్మూర్ మండలము (Balmoor Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్అచ్చంపేట
జనాభా31240 (2001)
38732 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంఅచ్చంపేట
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులుకపిలవాయి లింగమూర్తి,
బల్మూరు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము అచ్చంపేట రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు, 13 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38732. పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి , రాష్ట్ర బార్‌కౌన్సిల్ చైర్మెన్‌గా ఎన్నికైన అనంత నరసింహారెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 31240. ఇందులో పురుషులు 15903, మహిళలు 15337
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38732. ఇందులో పురుషులు 20079, మహిళలు 18653. జనాభాలో ఇది జిల్లాలో 61వ స్థానంలో ఉంది. స్త్రీపురుష నిష్పత్తిలో (929/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చివరి నుంచి మూడవ స్థానంలో ఉంది.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున ఉప్పునూతల మండలము, తూర్పున అచ్చంపేట మండలం, దక్షిణమున అమ్రాబాదు మండలము, పశ్చిమాన పెద్దకొత్తపల్లి మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
బల్మూరు మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వి.వెంకట్రాములుగౌడ్ ఎన్నికయ్యారు. 2014లో ఎంపిపిగా తెరాస పార్టీకి చెందిన కరుణాకర్ రావు ఎన్నికయ్యారు.
2014 ఎంపీటీసి ఎన్నికలలో మండలంలోని 11 స్థానాలకుగాను తెరాస 5, కాంగ్రెస్ పార్టీ 5, తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి.

అచ్చంపేట నియోజకవర్గంలో
బల్మూర్ మండల స్థానం (నీలం రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 33 ప్రాథమిక పాఠశాలలు (5 ప్రభుత్వ, 24 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 7 ప్రాథమికోన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 5 మండల పరిషత్తు), 6 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 4 జడ్పీ, 1 ప్రైవేట్), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 39636 హెక్టార్లలో 33% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. వరి, జొన్నలు, ప్రత్తి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 695 మిమీ. మండలంలో సుమారు 2800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 

మండల ప్రముఖులు:
  • కపిలవాయి లింగమూర్తి (ప్రత్యేక వ్యాసం):
  • అనంత నరసింహారెడ్డి: రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మెన్‌గా రెండుసార్లు ఎన్నికైన అనంత నరసింహారెడ్డి బల్మూరుకు చెందినవారు. 2006 జూన్ 25న తొలిసారి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మెన్‌గా ఎన్నికవగా, 2012 ఫిబ్రవరి 26న రెండోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు నల్లారి ద్వారకనాథ్ రెడ్డిని ఓడించి చైర్మెన్ పదవి పొందారు. 1977లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.
  • వేనేపల్లి భగవంతరావు: ఏప్రిల్ 20, 1935న బల్మూరు మండలం కొండనాగుల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన భగవంతరావు స్వగ్రామం మరియు పరిసర గ్రామాల అభివృద్ధికి తోడ్పడ్డారు. 1954లో వార్డు సభ్యునిగా, 1967లో సర్పంచిగా ఎన్నికయ్యారు. 1970లో ఏకగ్రీవంగా సర్పంచి పదవిలో వచ్చారు. 1982లో కొండనాగుల గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషిచేశారు. దీనికై 10 ఎకరాల స్వంతస్థలం కేటాయించారు. 1983లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేశారు. నవంబరు 6, 2004న మరణించారు. 
  • గన్నోజు విష్ణుమూర్తి:
కాలరేఖ:
  • 2014, జూలై 4: ఎంపిపిగా తెరాస పార్టీకి చెందిన కరుణాకర్ రావు ఎన్నికయ్యారు. 
  • 2016, అక్టోబరు 11: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాలో భాగమైంది.
    బల్మూర్ మండలంలోని గ్రామపంచాయతీలు
    1.అనంతవరం6.చిన్నారం (పిజి)10.బల్మూరు
    2.కొండనాగుల7.జీనుకుంట11.బాణాల
    3.కొండారెడ్డిపల్లి8.తుమ్మన్‌పేట్12.రామాజీపల్లి
    4.గట్టుతుమ్మెన్9.పోలిశెట్టిపల్లి13.లక్ష్మిపల్లి
    5.గోదల్

విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  బల్మూరు మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011,
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు, 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు G.O.Ms.Ni.243 Dt 11-10-2016


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక