పాలెం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలమునకు చెందిన గ్రామము. మహబూబ్‌నగర్ - నాగర్ కర్నూల్ రహదారిపై ఉన్న ఈ గ్రామం 1981లో మేజర్ గ్రామపంచాయతి హోదా లభించింది. జిల్లాలో తొలిసారిగా పౌల్ట్రీ పరిశ్రమ పాలెంలోనే ప్రారంభమైంది. తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ పాలెం గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ఈయన కృషితో గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యాయి..
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5172. ఇందులో పురుషులు 2867, మహిళలు 2305, గృహాలసంఖ్య 967. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4511. ఇందులో పురుషులు 2294, మహిళలు 2217, గృహాల సంఖ్య 1035. అక్షరాస్యత శాతం 61.23%. గ్రామ కోడ్ సంఖ్య 575754. రాజకీయాలు: 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా పి.సుమలత ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో 2 మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, తోటపల్లి సుబ్రహ్మణ్యం స్మారక ఎయిడెడ్ పాఠశాల, న్యూ లిటిల్ రోజెస్ స్కూల్, శాంతినికేతన్ పాఠశాల, ఎస్వీ మోడల్ స్కూల్ ఉన్నాయి. కొట్టల్‌గడ్డ, సుబ్బయ్యగూడెం లలో ప్రాథమిక పాఠశాలలున్నాయి. తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ: బిజినేపల్లి మండలంలో పాలెం గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కారకుడైన వ్యక్తి తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ. పాలెం గ్రామాభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేసి అందరిచేత పాలెం సుబ్బయ్యగా పిలిపించుకున్న ఘనత పొందిన ప్రముఖుడీయన. గ్రామంలో పాఠశాలలు, కళాశాలలు, ప్రాచ్యకళాశాల, దేవాలయాలు, ఆరోగ్యకేంద్రం, వ్యవసాయ పరిశోధన్ కేంద్రం, టెలిఫోన్ సౌకర్యం, కర్మాగారాలు తదితర స్థాపనకు కారకుడై రాష్ట్ర స్థాయిలోనే పాలెం గ్రామానికి గుర్తింపు తీసుకువచ్చారు. గ్రామానికి ఈయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన నిలవెత్తు విగ్రహాన్ని స్థాపించి గౌరవించారు. ఆయన స్థాపించిన పాఠశాలకు టీ.ఎస్.ఎం.ఉన్నత పాఠశాలగా నామకరణం చేయబడింది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
19, జనవరి 2014, ఆదివారం
పాలెం (Palem)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి