ముకురాల రామారెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మరియు రచయిత. ఇతను కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జనవరి 1, 1929న జన్మించారు. 1947-48 లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొంది ఉద్యోగంలో ప్రవేశించి తెలుగు అకాడమి ఉప సంచాలకులుగా పనిచేసి పదవీవిరమణ పొందారు. తెలుగులో పలు రచనలు చేసి ఫిబ్రవరి 24, 2003న మరణించారు. ఇతని రచనలలో ప్రముఖమైనవి దేవరకొండ దుర్గము (దేవరకొండ కోట వర్ణన - ఖండకావ్యం), నవ్వేకత్తులు, హృదయశైలి, మేఘదూత. తెలుగు మాస పత్రిక దుందుభికి సంపదకత్వం వహించారు. ఆంధ్ర సరస్వతి పరిషత్, తెలంగాణ రచయితల సంఘంలో 1950 వరకు పని చేశారు. 1974లో విజ్ఞాన వర్దిని పరిషత్‌ను నిర్వహించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
1964/65 లే తెలుగు సాహిత్య మాసపత్రిక స్రవంతి లో వీరు రచించిన దైన్యమానవేశ్వరుడు అనే పద్యకావ్యము ప్రచురితమయింది. ఇది శివునిపై అద్భుతమైన నిందా స్తుతి. ఇది కలికియున్నవారు నా ఈమేయిల్ ynaresh78@gmail.com కు పంపగలరని మనవి.
రిప్లయితొలగించండి