తెలంగాణలోని ప్రముఖ గిరిదుర్గాలలో ఒకటైన దేవరకొండ కోట నల్గొండ జిల్లా దేవరకొండలో ఉంది. క్రీ.శ.13వ శతాబ్దిలో నిర్మించిన ఈ కోట 500 అడుగుల ఎత్తున 7 కొండల నడుమ ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల మధ్యన నిర్మితమైంది. కోటకు 9 ద్వారాలు, 360 బురుజున్నాయి. కోటలోపల పలు బావులు, ధాన్యాగారాలు, ఆయుధాగారాలు, సైనిక నివాసాలు, రాజమందిరం, అంతఃపురం, సభావేదికలు ఉన్నాయి. ప్రధానద్వారంపై పూర్ణకుంభం ముద్ర ఉంది. ప్రముఖ రచయిత ముకురాల రామారెడ్డి "దేవరకొండ దుర్గం" ఖండకావ్యం రచించారు. వరకొండ కోట కేంద్రంగా పాలించినవారిలో ముఖ్యులు పద్మనాయకులు
చరిత్ర: కాకతీయుల సామంతులుగా ఉండి స్వతంత్రులైన పద్మానాయకులచే దేవరకొండ దుర్గం నిర్మించబడినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు. మాదానాయుడు కాలంలో దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు ఆధారాలు లభించాయి. క్రీ.శ.13 -15 శతాబ్దాల మధ్య పద్మనాయకులు దేవరకొండ కేంద్రంగా సుమారు 150 సంవత్సరాలు పాలించారు. తర్వాతి కాలంలో ఈ కోట బహమనీ, కుతుబ్‌షాహీల వశమై ప్రత్యేకతను కోల్పోయింది. తెలంగాణ మొత్తంతో పాటు ఇది కూడా కొంతకాలం మొఘలుల అధీనంలో ఉండి తర్వాత నిజాం రాజ్యంలో భాగమై 1948లో భారత యూనియన్‌లో కలిసింది. ప్రస్తుతం ఈ కొట పురావస్తుశాఖ పరిధిలో ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
13, డిసెంబర్ 2020, ఆదివారం
దేవరకొండ కోట (Devarakonda Fort)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి