9, మార్చి 2013, శనివారం

పూడూరు రైల్వేస్టేషన్ (Poodur Railway Station)

పూడూరు రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా గద్వాల మండలములో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 196కిమీ, డోన్ నుంచి 102 కిమీ దూరంలో ఉన్నది. ఇది గద్వాల స్టేషన్ మరియు పెద్దదిన్నె రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. పూడూరు స్టేషన్ గద్వాల నుంచి 8 కిమీ, పెద్దదిన్నె నుంచి 7 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు ) మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  గద్వాల మండలము,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి