అప్పాయిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 838. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 12 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది.
సరిహద్దులు: అప్పాయిపల్లి గ్రామం భౌగోళికంగా మండలంలో పశ్చిమం వైపున ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున కదూర్, పశ్చిమాన ఓబ్లాయిపల్లి, ఉత్తరమున రామచంద్రాపూర్ గ్రామాలు సరిహద్దులుగాఉండగా, దక్షిణమున దేవరకద్ర మండలం సరిహద్దుగా ఉన్నాది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 838. ఇందులో పురుషులు 4299, మహిళలు 409. గృహాల సంఖ్య 172. రవాణా సౌకర్యాలు: ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా అతి కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు రాయచూరు ప్రధాన రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా హెచ్.నాగయ్య ఎన్నికయ్యారు.
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి