27, ఏప్రిల్ 2013, శనివారం

ఏనుగొండ (Yenugonda)

ఏనుగొండ గ్రామము
గ్రామముఏనుగొండ
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4728 (2001)
ఏనుగొండ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4728. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 5 కిమీ దూరంలో ఉంది.  2012 వరకు ఇది ప్రత్యేక పంచాయతీగా ఉండేది. 2012లో ఈ పంచాయతీని మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేయబడింది. మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళు రహదారి,  సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం గ్రామం మీదుగా వెళుతున్నాయి. గ్రామంలో రైల్వ్స్టేషన్ కూడా ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఏనుగొండ గ్రామము జిల్లా కేంద్రానికి అతిసమీపంలో తూర్పు వైపున ఉంది. ఈ గ్రామానికి తూర్పున ఎదిర, ఉత్తరమున ఎరవల్లి, పశ్చిమాన మహబూబ్‌నగర్ పట్టణం ఉండగా, దక్షిణాన భూత్పూర్ మండలము సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4728. ఇందులో పురుషులు 2438, మహిళలు 2290. గృహాల సంఖ్య 888.

ఎస్వీఎస్ ఆసుపత్రి
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళు మార్గములో ఉంది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. గ్రామంలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండుట మరియు హైదరాబాదు రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి.

గ్రామపాలన:
2012 వరకు ఏనుగొండ ప్రత్యేక పంచాయతీగా ఉండేది. 2012లో ఈ పంచాయతి మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేయబడింది. పురపాలక సంఘంలో ప్రస్తుతం ఈ గ్రామము ఒకటవ వార్డుగా ఉంది. ప్రధాన రహదారి ప్రక్కనే వార్డు కార్యాలయం ఉంది.

విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  
.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి