వెంకటాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3028. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 6 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి కోయిలకొండ వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది.
భౌగోళికం, సరిహద్దులు: వెంకటాపూర్ గ్రామము జిల్లా కేంద్రానికి సమీపంలో పశ్చిమం వైపున ఉంది. ఈ గ్రామానికి తూర్పున మహబూబ్‌నగర్ పట్టణం సరిహద్దుగాఉండగా, ఉత్తరమున హన్వాడ మండలము, పశ్చిమాన మరియు దక్షిణాన కోయిలకొండ మండలము సరిహద్దుగా ఉన్నాది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3028. ఇందులో పురుషులు 1550, మహిళలు 1478. గృహాల సంఖ్య 512. రవాణా సౌకర్యాలు: ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి కోయిలకొండ వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు ప్రధాన రహదారిపై ఉండుటచే రవాణావసతులు బాగుగా ఉన్నాయి. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా శ్రీనివాస్ యాదవ్ ఎన్నికయ్యారు.
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి