బుద్ధారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2008లో గ్రామానికి నిర్మల్ పురస్కారం లభించింది. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2161. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 18 కిమీ దూరంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: బుద్ధారం గ్రామం మండలంలో భౌగోళికంగా ఉత్తరమున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున గుడిమల్కాపూర్, దక్షిణమున టంకర, వాయువ్యమున హన్వాడ, పశ్చిమమున ఇబ్రహీంబాద్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా ఉత్తరమున రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2161. ఇందులో పురుషులు 1132, మహిళలు 1029. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2589. ఇందులో పురుషులు 1360, మహిళలు 1229. గృహాల సంఖ్య 477, అక్షరాస్యత శాతం 41.5%. గ్రామ కోడ్ సంఖ్య 575069. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి మహాకూటమి అభ్యర్థి తెరాసకు చెందిన ఇబ్రహీంకు 54 ఓట్ల మెజారిటి లభించింది. ఇబ్రహీంకు 376 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 322, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 118, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 83 ఓట్లు లభించాయి. విద్యాసంస్థలు: గ్రామంలో మాధ్యమిక పాఠశాల ఉంది. కరంతండాలో ప్రాథమిక పాఠశాల ఉంది.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి