పాలమూరు జిల్లా
దేవరకద్ర మండలము చిన్నరాజమూరులో పురాతన చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఇదే చిన్నరాజమూరు ఆంజనేయస్వామిగా ప్రసిద్ధిచెందింది. సుమారు 400 సంవత్సరాల క్రితం తుంగభద్రనది తీరాన
వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామ శివారులో వ్యాసమహర్షిచే ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టించబడింది. కాలక్రమేణ ఇది భూస్థాపితమైంది. ఒకనాడు రైతు పొలం దున్నుచుండగా నాగలికి విగ్రహం తగిలింది. ఆ రోజు రాత్రి స్వామివారు ఆ రైతు కలలో కనిపించి ఈ విగ్రహాన్ని బండిపై వేసుకొని ఉత్తర దిశకు ప్రయాణమవ్వాలని, బండి ఇరుసు ఎక్కడైతే విరుగుతుందో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టించాలని చెపినట్లు కథనం. స్వామి వారు ఆదేశించినట్లుగా రైతు బండిలో విగ్రహాన్ని పెట్టి ఉత్తర దిశలో ప్రయాణం సాగించాడు. చివరికి ఈ ప్రాంతం రాగానే బండి చక్రం ఇరుసు తెగిపోవడం, స్వామివారిని ఇక్కడే ప్రతిష్టించడం జరిగింది. ఏటా స్వామివారికి మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఆలయం జిల్లా కేంద్రం నుంచి 30 కిమీ దూరంలో, మండల కేంద్రం దేవరకద్ర నుంచి 10 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి వచ్చేవారైనా, నారాయణపేట వైపు నుంచి వచ్చేవారైనా దేవరకద్ర చేరి అక్కడి నుంచి బస్సులు లేదా పైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి