షేక్‌పల్లి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1407. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 27 కిమీ దూరంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: షేక్‌పల్లి గ్రామం భౌగోళికంగా మండలంలో ఉత్తరంవైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణమున అయోధ్యనగర్ గ్రామం సరిహద్దుగా ఉండగా మిగితా మూడువైపులా రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1407. ఇందులో పురుషులు 698, మహిళలు 709. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1961. ఇందులో పురుషులు 1005, మహిళలు 956. గృహాల సంఖ్య 359, అక్షరాస్యత శాతం 41.4%. గ్రామ కోడ్ సంఖ్య 575057. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 48 ఓట్లు ఆధిక్యత లభించింది. 2009 జూన్‌లో షేక్‌పల్లి ఎంపీటీసి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.పెద్దచెన్నయ్య సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి రాఘవులుపై 216 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చెన్నయ్యకు 640, రాఘవులుకు 424, గోబ్రానాయక్ (తెదేపా)కు 174 ఓట్లు లభించాయి. విద్యాసంస్థలు: గ్రామంలో మాధ్యమిక పాఠశాల ఉంది. ఎల్లంబాయి తండా, చెల్మలాయికుంట తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి