23, ఏప్రిల్ 2013, మంగళవారం

మునిమోక్షం (Munimoksham)

మునిమోక్షం గ్రామము
గ్రామముమునిమోక్షం
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1921(2001),
2679 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575058
మునిమోక్షం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2008లో గ్రామానికి నిర్మల్ పురస్కారం లభించింది. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1921. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 18 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 147 హెక్టార అటవీప్రాంతం ఉంది. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
మునిమోక్షం గ్రామం భౌగోళికంగా మండలంలో ఉత్తరం వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున ఇబ్రహీంబాద్, దక్షిణమున దోరసముద్రం, పశ్చిమాన గుండ్యాల్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా ఉత్తరమున రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1921. ఇందులో పురుషులు 959, మహిళలు 962.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2679. ఇందులో పురుషులు 1317, మహిళలు 1362. గృహాల సంఖ్య 567, అక్షరాస్యత శాతం 39.7%. గ్రామ కోడ్ సంఖ్య 575058.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి మహాకూటమి అభ్యర్థి (తెరాస)కు చెందిన సయ్యద్ ఇబ్రహీంకు 182 ఓట్ల మెజారిటీ లభించింది. ఇబ్రహీంకు 396 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 214 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 162, ప్రజారాజ్యం అభ్యర్థికి 113 ఓట్లు లభించాయి.

విద్యాసంస్థలు:
గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది.

విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి