జమిస్తాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1768. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 5 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేట వెళ్ళు రహదారి గ్రామశివారు నుంచి వెళుతుంది. గ్రామశివారులో వరదయ్య చెరువు ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: జమిస్తాపూర్ గ్రామం భౌగోళికంగా మహబూబ్‌నగర్ మండలంలో దక్షణం వైపు ఉంది. ఈ గ్రామానికి పశ్చిమాన కదూర్, ఉత్తరాన ధర్మాపుర్ గ్రామం ఉండగా, దక్షిణాన మరియు తూర్పున అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2404. ఇందులో పురుషులు 1196, మహిళలు 1208.
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా అతి కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు రాయచూరు ప్రధాన రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి.
రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా దర్పల్లి బాలమణి ఎన్నికయ్యారు.
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి