ఎదిర మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 6775. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 10 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళు రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం గ్రామం మీదుగా వెళుతున్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఎదిర గ్రామం భౌగోళికంగా మహబూబ్‌నగర్ మండలంలో తూర్పు వైపు ఉంది. ఈ గ్రామానికి ఉత్తరాన నవాబ్‌పేట మండలం, తూర్పున జడ్చర్ల మండలం, దక్షిణాన భూత్పూర్ మండలం సరిహద్దు ఉండగా ఎరవల్లి, ఏనుగొండ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6775. ఇందులో పురుషులు 3406, మహిళలు 3369. ఇది మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి.
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు హైదరాబాదు రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి.
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి