27, ఏప్రిల్ 2013, శనివారం

పాలకొండ (Palakonda)

పాలకొండ గ్రామము
గ్రామముపాలకొండ 
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2165 (2001)
పాలకొండ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2165. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 6 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది. గ్రామశివారులో పెద్ద చెరువు ఉంది. 2011లో ఈ గ్రామాన్ని మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేశారు.

భౌగోళికం, సరిహద్దులు:

పాలకొండ గ్రామము మహబూబ్‌నగర్ పట్టాణానికి అతి సమీపంలో ఆగ్నేయవైపున భూత్పూర్ మండల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున మరియు దక్షిణాన భూత్పూర్ మండలం సరిహద్దు ఉండగా, ఉత్తరాన కొంతవరకు ఏనుగొండ, మిగితావైపు మహబుబ్‌నగర్ పట్టణం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2165. ఇందులో పురుషులు 1078, మహిళలు 1087. గృహాల సంఖ్య 427.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామము జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండుట మరియు భూత్పూర్ రహదారిపై ఉండుటచే రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి, బస్సులు, ప్రైవేట్ వాహనాలు బాగా అందుబాటులో కలవు.

గ్రామపాలన:
ఇదివరకు  ఈ గ్రామం పంచాయతి కేంద్రంగా ఉండేది. 2011లో ఈ గ్రామాన్ని మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేశారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి