ఇబ్రహీంబాద్ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2963. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 16 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 110 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. హేమసముద్రం చెరువు గ్రామపరిధిలో ఉంది. హేమసముద్రం చెరువు అలుగు సమీపంలో శ్రీవీరభద్రేశ్వరస్వామి ఆలయం ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమలనాథస్వామి ఆళయం, వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఇబ్రహీంబాద్ గ్రామం మండలంలో ఉత్తరం వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున బుద్ధారం, పశ్చిమమున మునిమోక్షం, దక్షిణమున అమ్మాపూర్, నాయినోనిపల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, ఉత్తరమున రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం గుండా వెళ్ళుచున్నది. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2963. ఇందులో పురుషులు 1437, మహిళలు 1526. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3485. ఇందులో పురుషులు 1761, మహిళలు 1724. గృహాల సంఖ్య 755, అక్షరాస్యత శాతం 48.6%. గ్రామ కోడ్ సంఖ్య 575070. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 141 ఓట్ల మెజారిటి లభించింది. విద్యాసంస్థలు: గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. తిరుమల గిరి, పుల్పోనిపల్లిలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి