23, ఏప్రిల్ 2013, మంగళవారం

కొత్తపేట (Kothapet)

కొత్తపేట గ్రామము
గ్రామముకొత్తపేట
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3243 (2001),
4104 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575067
కొత్తపేట మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3243. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 7 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 307హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
కొట్టపేట గ్రామం భౌగోళికంగా మండలంలో తూర్పు వైపున నవాబ్‌పేట మండల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరమున టంకర, దాచక్‌పల్లి, పశ్చిమమున పెద్దదర్పల్లి, దక్షిణమున చిన్నదర్పల్లి గ్రామాలు ఉండగా తూర్పున నవాబ్‌పేట మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3243. ఇందులో పురుషులు 1610, మహిళలు 1633.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4104. ఇందులో పురుషులు 2062, మహిళలు 2042. గృహాల సంఖ్య 841, అక్షరాస్యత శాతం 42.1%. గ్రామ కోడ్ సంఖ్య 575067

విద్యాసంస్థలు:
గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. పిల్లిగుండు తండా, ఎనమీది తండా, సూర్యనాయక్ తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.

విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి