25, ఏప్రిల్ 2013, గురువారం

నాగూరావు నామాజి (Nagurao Namaji)

పాలమూరు జిల్లాకు చెందిన భాజపా నేతలలో ప్రముఖులైన నాగూరావు నామాజీ నారాయణపేట పట్టణానికి చెందినవారు. నారాయణపేట పట్టణంలో మరియు పరిసరాలలొ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు 30 సంవత్సరాలకు పైగా కృషిచేస్తున్నారు. 2004లో మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్పతేడాతో పరాజయం పొందారు. భాజపా జిల్లా అధ్యక్షుడిగా, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, భాజపా తెలంగాణా కన్వీనర్‌గా పనిచేశారు. నాగూరావు భార్య లలితాబాయి నామాజీ నారాయణపేట పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేశారు.

1983లో తొలిసారి నాగూరావు నామాజీ మక్తల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985, 89లలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల పోటీచేసే అవకాశం లభించలేదు. 1994లో భాజపా తరఫున పోటీచేసి ఎల్కోటి ఎల్లారెడ్డి చేతిలో పరాజయం పొందారు. 1999లో తెదేపా తో పొత్తువల్ల మరోసారి పోటీకి దూరంగా ఉండి ఎల్కోటి ఎల్లారెడ్డి విజయానికి కృషిచేశారు. 2004లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం నర్సిరెడ్డి చేతిలో స్వల్పతేడాతో పరాజయం పొందినారు2009లో కొత్తగా ఏర్పడిన నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిననూ విజయం లభించలేదు. నారాయణపేట, ఉట్కూరు, దామరగిద్ద మండలాలలో భాజపా తరఫున అనేకమంది సర్పంచులు, ఎంపీటీసిలు విజయం సాధించడానికి నామాజి కారకులయ్యారు


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులుతెలంగాణ భాజపా ప్రముఖులు, నారాయణపేట మండలం,   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి