దామరగిద్ద నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. ఇది డివిజన్ కేంద్రమైన నారాయణ పేట నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కోస్గి వైపు ఉన్నది. ఇక్కడ నీటి కొరత చాలా అధికంగా కలదు. సాగు నీరుకై కేవలం వర్షాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. ఈ మండలము నారాయణపేట రెవెన్యూ డివిజన్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. దామరగిద్ద మరియు కానుకుర్తి మండలంలోని పెద్ద గ్రామాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 57881. మండలానికి సరిహద్దులో కర్టాటకలో ప్రసిద్ధమైన యానగుంది మాణిక్యేశ్వరి మాత క్షేత్రం ఉంది. సంగీతకారుడిగా పేరుపొందిన కిషన్ రావు చౌదరి దామరగిద్దకు చెందినవారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున దౌల్తాబాదు మండలము, తూర్పున మద్దూరు మండలము, దక్షిణమున నారాయణపేట మండలము, పశ్చిమాన కర్టాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49221. ఇందులో పురుషులు 24590, మహిళలు 24631. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 57881. ఇందులో పురుషులు 28960, మహిళలు 28921. అక్షరాస్యుల సంఖ్య 22688. రవాణా సౌకర్యాలు: నారాయణపేట నుంచి యాద్గిర్ మరియు మద్దూర్ వెళ్ళు రహదారులు మండలం గుండా వెళ్ళుచున్నాయి. రాజకీయాలు: ఈ మండలము నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రవీంద్రనాథ్, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట్రాములు గౌడ్ ఎన్నికయ్యారు. మండలంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. మండల వ్యవస్థ ప్రారంభం నుంచి 2008 వరకు మండల అధ్యక్షులుగా పనిచేసిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలున్నాయి. 2006 ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6, తెలుగుదేశం పార్టీ 4, సీపీఐ 3, భాజపా 1 స్థానంలో విజయం సాధించాయి. ఎంపీపీ ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ లకు సమానంగా ఏడేసి ఓట్లు రాగా టాస్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. రెండున్నర సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ ఎంపీపీ స్థానం పొందింది. 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో మండలంలోని 23 పంచాయతీలకు గాను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 11, కాంగ్రెస్ పార్టి మద్దతుదారులు 6, వైకాపా మద్దతుదారులు ఇద్దరు, తెరాస మద్దతుదారు ఒకరు, స్వతంత్రులు ముగ్గురు సర్పంచి స్థానాలలో విజయం సాధించారు.
మండలం మొత్తం విస్తీర్ణం 19258 హెక్టార్లలో 67% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంటలు పెసర్లు, కందులు. వరి, జొన్నలు, వేరుశనగా కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 556 మిమీ. మండలంలో సుమారు 1900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 31 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 7 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ) పాఠశాలలు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నది.
ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
దామరగిద్ద మండలము (Damargidda Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి