మహబూబ్‌నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో మక్తల్ నియోజకవర్గం ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు. పునర్విభజన ఫలితంగా రద్దయిన అమరచింత నియోజకవర్గం నుంచి నర్వ, ఆత్మకూరు మండలాలు ఇందులో కలిశాయి. ఇది వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న నారాయణపేట మండలం మరియు దామరగిద్ద మండలంలోని కొన్ని గ్రామాలు కొత్తగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలిశాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రామచందర్ రావు కళ్యాణి మరియు చిట్టెం నర్సిరెడ్డి ఇక్కడి నుంచి మూడేసిసార్లు విజయం సాధించారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు నియోజకవర్గ భౌగోళిక సమాచారం మహబూబ్‌నగర్ జిల్లాలో పశ్చిమం వైపున త్రికోణాకారంలో ఉన్న మక్తల్ నియోజకవర్గం పశ్చిమాన కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కలిగి ఉంది. ఉత్తరాన నారాయణపేట నియోజకవర్గం సరిహద్దుగా ఉండగా, దక్షిణాన కర్ణాటకతో పాటు గద్వాల నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. తూర్పువైపున దేవరకద్ర నియోజకవర్గం ఉన్నది. హైదరాబాదు - రాయచూరు ప్రధానరహదారి ఈ నియోజకవర్గంలో మక్తల్, మాగనూరు మండలాల గుండా వెళుతుంది. ఎన్నికైన శాసనసభ్యులు
1999 ఎన్నికలు 1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం నర్సిరెడ్డిపై 12563 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎల్లారెడ్డి 55404 ఓట్లు సాధించగా, చిట్టెం నర్సిరెడ్డి 42841 ఓట్లు పొందినారు. 2004 ఎన్నికలు 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం నర్సిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాగూరావు నామాజిపై 2356 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందినారు. నర్సిరెడ్డి 55375 ఓట్లు సాధించగా, నాగూరావు నామాజి 53019 ఓట్లు పొందినారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండటంతో ఈ స్థానంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. నలుగులు అభ్యర్థులు పోటీచేయగా ప్రధాన పోటీ భాజపా మరియు కాంగ్రెస్ మధ్యనే సాగింది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు కలిపి మొత్తం ఓట్లలో 95% పైగా సాధించారు. మిగిలిన రెండు అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. 2005 ఉప ఎన్నికలు 2005 ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు నారాయణ పేట పట్టణంలో నక్సలైట్ల దాడితో చిట్టెం నర్సిరెడ్డి మృతి చెందడంతో ఏర్పడిన ఖాళీ వల్ల 2005 డిసెంబర్‌లో జరిగిన ఉపఎన్నికలో ఈ స్థానం నుంచి నర్సిరెడ్డి కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సూగప్పపై 40,079 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలుగుదేశం , తెలంగాణ రాష్ట్ర సమితిలి కూడా బరిలో ఉండకపోవడం మెజారిటీ భారీగా లభించడమే కాకుండా ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. 2009 ఎన్నికలు 2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ పొత్తుతో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎం.శ్రీధర్ గౌడ్ పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున జి.నింగిరెడ్డి మరియు ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్న మనపార్టీ తరఫున శ్రీహరి లోక్‌సత్తా పార్టీ తరఫున కె.రాజమల్లేష్ పోటీలోక్ దిగారు. తెలుగుదేశం పార్టి టికెట్టు ఆశించి పొత్తులో భాగంగా ఈ స్థానం తెరాసకు వెళ్ళడంతో దయాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ప్రధానపోటీ దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ రెబెల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా పోటీచేసిన దయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహనరావుపై 5701 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలు: 2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 10185 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున చిట్టెం రామ్మోహన్ రెడ్డి, భాజపా తరఫున బి.కొండయ్య, ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన కె.దయాకర్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జలందర్ రెడ్డి పై 48291 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గపు ప్రముఖులు
|
23, జనవరి 2013, బుధవారం
మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం (Makthal Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి