నాయినోనిపల్లి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతికేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1376. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 13 కిమీ దూరంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: నాయినోనిపల్లి గ్రామం భౌగోళికంగా మండలంలో మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణమున మరియు తూర్పున హన్వాడ, పశ్చిమాన అమ్మాపూర్, ఉత్తరమున ఇబ్రహీంబాద్ గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1376. ఇందులో పురుషులు 689, మహిళలు 687. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1575. ఇందులో పురుషులు 798, మహిళలు 777. గృహాల సంఖ్య 337, అక్షరాస్యత శాతం 40.4%. గ్రామ కోడ్ సంఖ్య 575063. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 5 ఓట్ల మెజారిటి లభించింది. రాజేశ్వర్ రెడ్డికి 226, తెరాస అభ్యర్థి ఇబ్రహీంకు 221, కాంగ్రెస్ అభ్యర్థి పులివీరన్నకు 105, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 113 ఓట్లు లభించాయి. విద్యాసంస్థలు: గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. నాయినోనిపల్లిలో మరియు చెంచుపెంటలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలున్నాయి.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి