శ్రీరంగాపూర్ మండలకేంద్రంలో పెబ్బేరుకు 10 కిమీ దూరంలో ఉన్న శ్రీరంగనాయకస్వామి దేవాలయం నెలకొనియున్నది. 17వ శతాబ్దంలో వనపర్తి సంస్థానాధీశులచే నిర్మించబడిన ఈ ఆలయం జిల్లాలోనే ప్రముఖ వైష్ణవక్షేత్రంగా వెలుగుందుతున్నది. శిల్పకళా నైపుణ్యంలో ఈ దేవాలయం పేరుపొందింది. రంగసముద్రం అనబడే పెద్ద చెరువు మధ్యలో విశాలమైన 10ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మించినందున సుందర ప్రకృతి దృశ్యాలు భక్తులనే కాకుడా సినీపరిశ్రమను కూడా ఆకట్టుకున్నాయి. ప్రతిఏటా ఉగాదికి 15 రోజుల ముందు రంగనాయకస్వామి రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సమీపంలోనే అలివేలు మంగమ్మ ఆలయం కూడా ఉంది. రంగనాథస్వామి శ్రీవేంకటేశ్వరస్వామి అవతారమేనని పూర్వీకులకథనం. ఏటా ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇది తమిళనాడులోని శ్రీరంగం దేవాలయాన్ని పోలి ఉంటుంది. శ్రీరంగనాథస్వామి వనపర్తి సంస్థానాధీశుల కులదైవం.
= = = = =
|

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి