మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలము శ్రీరంగాపూర్ గ్రామంలో సంస్థానాధీశులు నిర్మించిన పెద్ద చెరువే రంగసముద్రంగా పిలివబడుతున్నది. వనపర్తి సంస్థానాధీశులు శ్రీరంగనాయకస్వామి ఆలయం నిర్మించే సమయంలో దాని సమీపంలోనే ఇది కూడా నిర్మించారు. సంస్థానాధీశుల కాలం నాటి పేరుపొందిన సప్తసముద్రాలలో ఇది ఒకటి. దీని మధ్యలో కృష్ణవిలాస్ బంగ్లా ఉంది. అప్పటి సంస్థానాధీశులు విశ్రాంతి కోసం ఈ భవనాన్ని ఉపయోగించేవారు. రంగసముద్రాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా మార్చారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ప్రాంతంలో పలు సినిమా షూటింగులు జరిగాయి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా పర్యాటకప్రదేశాలు, పెబ్బేరు మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి