3, ఏప్రిల్ 2013, బుధవారం

ఉప్పునూతల కేదేశ్వరాలయం (Uppunuthala Kedareshwara Swamy Temple)

ఉప్పునూతల కేదేశ్వరాలయం
అచ్చంపేట సమీపంలోని ఉప్పునూతల మండల కేంద్రంలో ప్రాచీనమైన కేదేశ్వరాలయం నెలకొని ఉంది. ఆలయం లోపలి భాగాన రాతి స్తంభాలలో ఒకదానికి నలువైపులా శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఇది ద్వికూటాలయం. దీనిలో కేదారేశ్వరస్వామితో పాటు చెన్నకేశవ ప్రతిష్ట కూడా ఉంది. ఆలయానికి ద్వారాలు కూడా రెండు ఉన్నాయి. ఉప్పునూతలకు పూర్వనామం ఉప్పునుంతల. పూర్వం ఈ గ్రామంలో వందలాది ఆలయాలు ఉండేవట. కాని ప్రస్తుతం కేదాశ్వరాలయం మాత్రమే మిగిలియుంది. కేదేశ్వరాలయాన్ని కట్టోజు అనే శిల్పి నిర్మించినట్లు తెలుస్తుంది. ఉప్పునూతలలో 4 ప్రాచీన బురుజులుండేవట కాని ప్రస్తుతం శిథిలరూపంలో ఉన్న ఒక్క బురుజు మాత్రమే కనిపిస్తుంది. దుందుభీక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన మామిళ్ళపల్లి ఆలయం కూడా దీనికి సమీపంలోనే ఉంది.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  ఉప్పునూతల మండలము, 

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి