గోపాలపూర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 ప్రకారం గ్రామ జనాభా 1021. ఈ గ్రామం రెవెన్యూ గ్రామం అయినప్పటికీ పంచాయతి కేంద్రం కాదు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలం మధ్యలో మండల కేంద్రం భూత్పూరుకు అతిసమీపంలో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన భూత్పూర్, తూర్పున కొత్తమొల్గర, పశ్చిమాన పోతులమడుగు, దక్షిణాన కప్పెట గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 663. ఇందులో పురుషులు 345, మహిళలు 318. గృహాల సంఖ్య 127. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1021. ఇందులో పురుషులు 537, మహిళలు 484. గృహాల సంఖ్య 193. అక్షరాస్యత శాతం 51.91%. గ్రామ కోడ్ సంఖ్య 575548. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న భూత్పూరుకు అతిసమీపంలో ఉండుటచే గ్రామానికి రవాణా సౌకర్యాలు బాగుగా అందుబాటులో ఉన్నాయి. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి