ఎల్కిచెర్ల మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 ప్రకారం గ్రామ జనాభా 4633.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున ఘన్‌పూర్, తిమ్మాజీపేట మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన కరివెన, పశ్చిమాన మద్దిగట్ల గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, దక్షిణాన ఘన్‌పూర్ మండలం, తూర్పున తిమ్మాజీపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4291. ఇందులో పురుషులు 2178, మహిళలు 2113. గృహాల సంఖ్య 902. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4633. ఇందులో పురుషులు 2356, మహిళలు 2277. గృహాల సంఖ్య 985. అక్షరాస్యత శాతం 41.53%. గ్రామ కోడ్ సంఖ్య 575556. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్-శ్రీశైలం ప్రధాన రహదారి గ్రామం సమీపం నుంచి వెళ్ళుచున్నది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో విజయమ్మ (ఇండిపెండెంట్) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా కె.నాగయ్య ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక .జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, బాదం సరోజాదేవి విద్యాలయ (ప్రైవేట్ ఉన్నత పాఠశాల) ఉన్నాయి. దీనికి అనుబంధ గ్రామమైన భట్టుపల్లిలో మరియు భట్టుపల్లి తండాలలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు కలవు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి