మద్దిగట్ల మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 ప్రకారం గ్రామ జనాభా 3249.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో దక్షిణం వైపున ఘన్‌పూర్ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున ఎల్కిచెర్ల, ఉత్తరాన కరివెన, పశ్చిమాన పాతమొల్గర,వాయువ్యాన కొత్తమొల్గర గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, దక్షిణాన మరియు ఆగ్నేయాన ఘన్‌పూర్ మండలం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2645. ఇందులో పురుషులు 1286, మహిళలు 1359. గృహాల సంఖ్య 525. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3249. ఇందులో పురుషులు 1648, మహిళలు 1601. గృహాల సంఖ్య 683. అక్షరాస్యత శాతం 48.29%. గ్రామ కోడ్ సంఖ్య 575555. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్-శ్రీశైలం ప్రధాన రహదారి గ్రామ శివారు నుంచి వెళ్ళుచున్నది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా కుమ్మరి చంద్రయ్య ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండలపరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఒక ప్రైవేట్ పాథమిక పాఠశాల (అనూష కాన్వెంట్) కలవు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి