కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో జన్మించిన శ్రీహరి 1987లో తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి 3 సార్లు శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు. 2015, జనవరి 26న తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించింది.
రాజకీయ ప్రస్థానం: 1987లో ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి అదే సంవత్సరం వరంగల్ నగరపాలక సంస్థ చైర్మెన్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1988 నుంచి 2004 వరకు వరంగల్ జిల్లా తెదేపా కన్వీనర్‌గా పనిచేశారు. 1994, 1999లలో స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదెపా తరఫున విజయం సాధించారు. 1995 నుంచి 2004 వరకు ఎన్టీయార్ మరియు చంద్రబాబు మంత్రివర్గాలలో పనిచేశారు. 2004లో తెరాసకు చెందిన కెప్టెన్ విజయరామారావు చేతిలో పరాజయం పొంది, తెరాస ఎమ్మెల్యేల రాజీనామాలతో 2008లో జరిగిన ఉప ఎన్నికలలో విజయం సాధించి మూడవ సారి శాసనసభలో ప్రవేశించారు. 2009లో మళ్ళీ ఓటమి చెందారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా, తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు.తెలుగుదేశం పార్యీ తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని నిరసిస్తూ మే 11, 2013న పార్టీకి రాజీనామా చేసి 26 సంవత్సరాల తెదేపా బంధాన్ని విడిచిపెట్టారు. 2015, జనవరి 26న తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించింది. తాటికొండ రాజయ్య ఉధ్వాసనతో 2015, జనవరి 26న తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించింది. 2015, జూన్ 1న ఎమ్మెల్సీగా ఎన్నికైనారు.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి