పాతమొల్గర మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1171. గ్రామ పరిధిలో 214 ఎకరాల ఆయకట్టు ఉన్న చింతలచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు నిధులు విడుదలైనాయి. ఈ గ్రామంలో గీతకార్మికులు అధికంగా ఉన్నారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామానికి ఉత్తరాన కొత్తమొల్గర, తూర్పున మద్దిగట్ల, పశ్చిమాన కప్పెట, దక్షిణాన ఘన్‌పూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1134. ఇందులో పురుషులు 553, మహిళలు 581. గృహాల సంఖ్య 246. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1171. ఇందులో పురుషులు 593, మహిళలు 578. గృహాల సంఖ్య 253. అక్షరాస్యత శాతం 51.75%. గ్రామ కోడ్ సంఖ్య 575554. రవాణా సౌకర్యాలు: ఈ గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారులు లేవు. అయిననూ 44వ నెంబరు జాతీయ రహదారి మరియు మహబూబ్‌నగర్-శ్రీశైలం రహదారి సమీపం నుంచి వెళ్ళుచున్నాయి. 2007లో ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ప్రారంభమైంది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో చిన్న కృష్ణయ్య (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బి.శ్రీనివాసులు గౌడ్ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి