కప్పెట మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 ప్రకారం గ్రామ జనాభా 1668. ఇది పంచాయతి కేంద్రము.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామానికి తూర్పున కొత్తమొల్గర, పాతమొల్గర, ఉత్తరాన గోపాలపూర్, పశ్చిమాన రావులపల్లి, వాయువ్యాన పోతులమడుగు గ్రామాలు, దక్షిణాన ఘన్‌పూర్ మండలం, నైరుతిన అడ్డాకల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1332. ఇందులో పురుషులు 662, మహిళలు 670. గృహాల సంఖ్య 259. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1668. ఇందులో పురుషులు 851, మహిళలు 817. గృహాల సంఖ్య 353. అక్షరాస్యత శాతం 49.46%. గ్రామ కోడ్ సంఖ్య 575553. రవాణా సౌకర్యాలు: ఈ గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారి లేదు. అయిననూ 44వ నెంబరు జాతీయ రహదారి మరియు మహబూబ్‌నగర్-శ్రీశైలం రహదారులు సమీపం నుంచి వెళ్ళుచున్నాయి. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో హెచ్.బుచ్చయ్య (ఇండిపెండెంట్) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా టి.మాధవి ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల కలవు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి