పాలమూరు జిల్లాకు చెందిన నిజాం వ్యతిరేక ఉద్యమకారులలో ప్రముఖులైన సురభి శేషశర్మ 1919 జనవరిలో కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ, ఆంధ్రమహాసభలోనూ కీలకపాత్ర పోషించారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలోకూడా ప్రముఖ పాత్ర వహించారు. 1944-51 కాలంలో జిల్లా కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1951లో వినోబాభావే సాగించిన భూదానోద్యమంలో పాల్గొని ఏడువేలకు పైగా ఎకరాల భూమిని ఇప్పించారు. 12 సంవత్సరాలు సర్వోదయ మండలి అధ్యక్షులుగా కొనసాగినారు.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి