అప్పిరెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో యస్మోన్‌కుంట చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2799.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2375. ఇందులో పురుషులు 1203, మహిళలు 1172. గృహాల సంఖ్య 422. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2799. ఇందులో పురుషులు 1413, మహిళలు 1386. గృహాల సంఖ్య 492. అక్షరాస్యత శాతం 42.05%. గ్రామ కోడ్ సంఖ్య 575453. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా హన్మంతు ఎన్నికయ్యారు. నీటిపారుదల: గ్రామ పరిధిలో 17 ఎకరాల ఆయకట్టు ఉన్న యస్మోన్‌కుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి