బొమ్మన్‌పాడ్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో గొడంగోనికుంట చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2795. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2385. ఇందులో పురుషులు 1154, మహిళలు 1231. గృహాల సంఖ్య 450. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2795. ఇందులో పురుషులు 1371, మహిళలు 1424. గృహాల సంఖ్య 598. అక్షరాస్యత శాతం 35.67%. గ్రామ కోడ్ సంఖ్య 575022. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా నందోళ్ళ సాయమ్మ ఎన్నికైనది. విద్యాసంస్థలు: గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. నీటిపారుదల: గ్రామ పరిధిలో 45 ఎకరాల ఆయకట్టు ఉన్న గొడంగోనికుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.
= = = = =
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి