దుద్యాల్ మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం మండలంలో అత్యధిక జనాభా కలిగియున్న రెండో పెద్ద గ్రామం. గ్రామ పరిధిలో 85 ఎకరాల ఆయకట్టు ఉన్న తుర్కలచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4782. ఇందులో పురుషులు 2421, మహిళలు 2361. గృహాలసంఖ్య 848. 2011 ప్రకారం గ్రామ జనాభా 5469. ఇందులో పురుషులు 2723, మహిళలు 2746, గృహాల సంఖ్య 1031. అక్షరాస్యత శాతం 44.29%. గ్రామ కోడ్ సంఖ్య 574940. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సోమనాథ్ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి