5, డిసెంబర్ 2013, గురువారం

చంద్రకల్ (Chandrakal)

 చంద్రకల్ గ్రామము
గ్రామముచంద్రకల్ 
మండలముదౌల్తాబాదు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1641 (2001)
2013 (2011)
చంద్రకల్ మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.ఇది కర్ణాటక సరిహద్దులో ఉన్నది. హైదరాబాదు- బీజాపుర్ అంతర్రాష్ట్ర రహదారి గ్రామం గుండా వెళ్ళుచున్నది. ఈ గ్రామం కోడంగల్ నుంచి 17 కిమీ, తాండూరు నుంచి 35 కిమీ దూరంలో ఉన్నది.

జనాభా:
2001 గణన ప్రకారం గ్రామ జనాభా 1641. ఇందులో పురుషులు 794, మహిళలు 847. గృహాల సంఖ్య 345.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2013. ఇందులో పురుషులు 988, మహిళలు 1025. గృహాల సంఖ్య 416. అక్షరాస్యత శాతం 52.91%. గ్రామ కోడ్ సంఖ్య 574969.

దేవాలయాలు:
గ్రామంలో బసవేశ్వర ఆలయం ప్రధానమైనది. ఏటా శ్రావణ మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. అభయాంజనేయస్వామి, శివాలయం కూడా ఉన్నాయి.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వి.మహాదేవి ఎన్నికయ్యారు.


విభాగాలు: దౌల్తాబాదు మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి