చిన్మల్ మైల్వార్ మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇక్కడ మామిడికుంట ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో మామిడిచెట్లు అధికంగా ఉన్నందున ఈ పేరువచ్చింది. ఇది కోడంగల్ నుంచి 7 కిమీ దూరంలో ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలు, రథోత్సవం జరుగుతుంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2460. ఇందులో పురుషులు 1226, మహిళలు 1234. గృహాలసంఖ్య 448. 2011 ప్రకారం గ్రామ జనాభా 3046. ఇందులో పురుషులు 1524, మహిళలు 1522, గృహాల సంఖ్య 545. అక్షరాస్యత శాతం 35.06%. గ్రామ కోడ్ సంఖ్య 574935. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అలివేలమ్మ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి