2, డిసెంబర్ 2013, సోమవారం

దామరగిద్ద (Damargidda)

 దామరగిద్ద గ్రామము
గ్రామముదామరగిద్ద 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభా7472 (2001)
9197 (2011)
పిన్‌కోడ్ 509407
దామరగిద్ద నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సంగీతకారుడు కిషన్ రావు చౌదరి దామరగిద్దకు చెందినవారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7472. ఇందులో పురుషులు 3717, మహిళలు 3755. గృహాల సంఖ్య 1325.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 9197. ఇందులో పురుషులు 4627, మహిళలు 4570. గృహాల సంఖ్య 1740. అక్షరాస్యత శాతం 42.48%. గ్రామ కోడ్ సంఖ్య 575016

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం జిల్లా కేంద్రం నారాయణపేట నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నారాయణపేట నుంచి మద్దూరు వెళ్ళు మార్గంలో ఉంది.

విద్యాసంస్థలు:
ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన : 2004-05), జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కస్తూర్‌బా గాంధీ బాలికల పాఠశాల, వివేకానంద విద్యామందిర్ ఉన్నాయి.

ఎంపిటీసి నియోజకవర్గం:
దామరగిద్ద గ్రామములో రెండు ఎంపీటీసి నియోజకవర్గాలు ఉన్నాయి. 2006 ఎన్నికలలో దామరగిద్ద-1 నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి గోవిందమ్మ విజయం సాధించగా, దామరగిద్ద-2 నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శరణ్య నాయక్ గెలుపొందాడు.

నీటిపారుదల:
గ్రామ పరిధిలో 117 ఎకరాల ఆయకట్టు ఉన్న నాగమ్మ చెరువు, 10 ఎకరాల ఆయకట్టు ఉన్న ఎరకుంట చెరువు ఉన్నాయి. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.


విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి