5, డిసెంబర్ 2013, గురువారం

దౌల్తాబాదు (Doulthabad)

 దౌల్తాబాదు గ్రామము
గ్రామముదౌల్తాబాదు 
మండలముదౌల్తాబాదు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా6800 (2001)
8170 (2011)
దౌల్తాబాదు మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ సరిహద్దులో పెద్ద చెరువు ఉంది. ఇది దౌల్తాబాదు చెరువుగా ప్రసిద్ధి చెందింది. చెరువు తీరాన పురాతనమైన శ్రీవేంకటేశ్వరాలయం, ఎత్తయిన కొండపై మల్కాసాహెబ్ దర్గా ఉన్నాయి. ఈ గ్రామం హైదరాబాదు- బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారి నుంచి 7 కిమీ లోనికి ఉంటుంది. కోస్గి, మద్దూరుల నుంచి కూడా రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

జనాభా:

2001 గణన ప్రకారం గ్రామ జనాభా 6800. ఇందులో పురుషులు 3426, మహిళలు 3374. గృహాల సంఖ్య 1331.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 8170. ఇందులో పురుషులు 4025, మహిళలు 4145. గృహాల సంఖ్య 1598. అక్షరాస్యత శాతం 34.48%. గ్రామ కోడ్ సంఖ్య 574980.

రాజకీయాలు:

జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా పార్వతమ్మ ఎన్నికయ్యారు.

విభాగాలు: దౌల్తాబాదు మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి