గడిమున్కాన్‌పల్లి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1884. ఇందులో పురుషులు 920, మహిళలు 964. గృహాల సంఖ్య 322. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2220. ఇందులో పురుషులు 1080, మహిళలు 1140. గృహాల సంఖ్య 427. అక్షరాస్యత శాతం 40.09%. గ్రామ కోడ్ సంఖ్య 575013. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా సాయమ్మ ఎన్నికైనది. విద్యాసంస్థలు: గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది. ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి సిపీఐ(ఎం) అభ్యర్థి మహేష్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మస్తి రాములుపై విజయం సాధించాడు. మొత్తం పోలైన ఓట్లు 1741 కాగా, మహేష్ గౌడ్‌కు 1209 ఓట్లు, మస్తి రాములుకు 450 ఓట్లు, భాజపా అభ్యర్థి మొగులయ్యకు 22 ఓట్లు లభించాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి