హకీంపేట్ నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం బొంరాస్‌పేట్ మండలం నుంచి కోస్గి మండలంలోకి చేర్చబడింది. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1905. ఇందులో పురుషులు 991, మహిళలు 914. గృహాలసంఖ్య 346. 2011 ప్రకారం గ్రామ జనాభా 1965. ఇందులో పురుషులు 988, మహిళలు 977, గృహాల సంఖ్య 410. అక్షరాస్యత శాతం 48.70%. గ్రామ కోడ్ సంఖ్య 574943. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అరుణమ్మ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి